ఆయనే సిఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

తెలంగాణా కాంగ్రెస్ లో వర్గాలు బయటపడుతున్నాయా...? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొందరు వ్యతిరేకిస్తున్నారా...? తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2024 | 05:42 PMLast Updated on: Aug 30, 2024 | 5:42 PM

Komatireddy Hot Comments

తెలంగాణా కాంగ్రెస్ లో వర్గాలు బయటపడుతున్నాయా…? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొందరు వ్యతిరేకిస్తున్నారా…? తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అంటున్నాయి తెలంగాణా రాజకీయ వర్గాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ముఖ్యమంత్రి గారు అని సంభోదించిన రాజగోపాల్ రెడ్డి… ఆ తర్వాత కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

నా నాలుక పైన నల్లటి మచ్చలు ఉన్నాయి నేను ఏమి అంటే అది అవుతుంది అని మా అమ్మ చెప్పింది అంటూ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్తు లో ముఖ్యమంత్రి అవుతారు అంటూ ఉత్తమ పై ప్రసంశలు కురిపించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కావాల్సిందని కాని ఆది ఆలస్యం అయిందని అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై ఎటువంటి దుమారం రేగుతుందో చూడాలి.