దీప్తికి కోటి, గ్రూప్ 2 జాబ్, రేవంత్ సంచలన నిర్ణయం
పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ఆమెకు భారీ ప్రోత్సాహకం ప్రకటించారు.

పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఆమెకు భారీ ప్రోత్సాహకం ప్రకటించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్ లో 500 గజాల స్థలం, కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
పారాలింపిక్స్ లో పార్టిసిపెంట్స్ కు కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్,ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ధన్యవాదాలు తెలిపారు.