KP Chowdary: టాలీవుడ్ సెలబ్రిటీలతో లింకేంటి.. KP చౌదరి విచారణలో విస్తుపోయే నిజాలు..
డ్రగ్స్ కేసులో అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ కేసులో నిజాలు బయటికి వచ్చే టైం దగ్గర పడింది. హైకోర్ట్ ఆదేశాలతో కేపీ చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ ప్రారంభించేందుకు చర్లపల్లి జైలు నుంచి కేపీ చౌదరిని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చాలా మంది సెలబ్రిటీస్‌తో సన్నిహిత సంబంధాలున్న కేపీ చౌదరి.. విచారణలో ఎలాంటి విషయాలు బయట పెడతారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

KP Chowdhary arrested in drug case is facing trial in Charlapally Jail He has links with many film celebrities
కేపీ చౌదరి విచారణ అనంతరం చాలా మంది సెలబ్రిటీలను పోలీసులు విచారించే అవకాశముంది. ఖమ్మం జిల్లాలో పుట్టిన కేపీ చౌదరి మొదట డిస్ట్రిబ్యూటర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కానీ సినిమాల్లో నష్టం రావడంతో గోవాకు మకాం మార్చారు. అక్కడ ఓ రిసార్ట్ ప్రారంభించాడు. హైదరాబాద్ నుంచి వచ్చే చాలా మంది సెలబ్రిటీలకు గోవాలో అకామిడేషన్ ఏర్పాటు చేసేవాడు. పార్టీలు కూడా అరేంజ్ చేసేవాడు. కానీ కొన్ని రోజులకు ఆ బిజినెస్‌లో కూడా లాస్ రావడంతో నష్టాలను కవర్ చేసుకునేందుకు గ్రడ్స్ బిజినెస్ చేయాలని అనుకున్నాడు.
నైజీరియాకు చెందిన ఓ డ్రగ్ డీలర్‌తో లింక్ పెట్టుకుని డ్రగ్స్ తెప్పించుకున్నాడు. హైదరాబాద్‌లో కొందరికి డ్రగ్స్ ఇచ్చేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. కానీ అప్పటికే ఈ విషయాన్ని పసిగట్టిన ఎస్‌ఓటీ టీం.. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో కేపీ చౌదరి హైదరాబాద్‌కు రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీ చౌదరికి డ్రగ్స్ సప్లై చేసిన డీలర్ కోసం 4 స్పెషల్ టీంలతో గాలింపు మొదలుపెట్టారు. అయితే హైదరాబాద్‌లో ఎవరికి డ్రగ్స్ అందించేదుకు కేపీ హైదరాబాద్‌కు వచ్చాడనేది విచారణ తరువాత బయటికి రానుంది.
డీలర్ దగ్గరి నుంచి తీసుకున్న డ్రగ్స్‌లో కొంత తానే తీసుకున్నానంటూ కేపీ చెప్తున్నాడు. ఆ డ్రగ్స్ నిజంగా కేపీనే తీసుకున్నాడా లేక అది ఇప్పటికే ఎవరికో అమ్మేశాడా అనే నిజాలు కూడా బయటికి రానున్నాయి. నేరుగా డ్రగ్స్‌తో హైదరాబాద్ వచ్చాడంటే కేపీతో డ్రగ్స్ కోసం టచ్‌లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరూ అనే నిజాలు కూడా పోలీసులు బయటికి లాగనున్నారు. కేపీ విచారణ అనంతరం చాలా మంది పేర్లు బయటికి వచ్చే అవకాశముంది. దీంతో ఇప్పుడు కేపీ విచారణ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది.