RADISON CASE : కొకైన్ తీసుకున్న క్రిష్.. బయటపెట్టిన రిమాండ్ రిపోర్ట్
హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలీ (Gachibowli) లోని రాడిసన్ హోటల్ (Radisson Hotel) డ్రగ్స్ (Drugs) కేసు రిమాండ్ రిపోర్ట్ లో సంచలనాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో డైరక్టర్ జాగర్లమూడి క్రిష్ (Director Jagarlamudi Krish) అడ్డంగా ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలీ (Gachibowli) లోని రాడిసన్ హోటల్ (Radisson Hotel) డ్రగ్స్ (Drugs) కేసు రిమాండ్ రిపోర్ట్ లో సంచలనాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో డైరక్టర్ జాగర్లమూడి క్రిష్ (Director Jagarlamudi Krish) అడ్డంగా ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్ లో కీలక విషయాలు బయటపడ్డాయి. గత ఏడాది కాలంగా వివేకానందతో కలసి క్రిష్ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు… ఎప్పుడు పార్టీలు పెట్టినా ఆయన కూడా అటెండ్ అవుతాడంటూ అబ్బాస్ సీక్రెట్స్ బయటపెట్టాడు.
రాడిసన్ హోటల్లో డ్రంగ్స్ దందా వ్యవహారం ఏడాదిగా సాగుతోందని తేలింది. డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన స్టేట్మెంట్ తో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. బీజేపీ నేత గజ్జల యోగానంద్ కొడుకు వివేకానంద్… ఏడాది కాలంగా డ్రగ్స్, ఇతర మత్తు పధార్థాలకు అలవాటుపడినట్టు తేలింది. ఈ కేసులో ఉన్న నిందితులంతా ఏడాదిగా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వాడుతున్నారు. హోటల్లోని 1200, 1204 నెంబర్ గల రెండు రూముల్లో డ్రగ్స్ సేవిస్తున్నట్టు అబ్బాస్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. వివేక్ తో పాటు ఆయన ఫ్రెండ్స్… డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సింధితో కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ నెల 24 జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో కూడా క్రిష్ పాల్గొన్నట్టు అబ్బాస్ తెలిపాడు. పేపర్ రోల్‌ని ఉపయోగించి తన స్నేహితులతో కలిసి వివేక్ కొకైన్ సేవించినట్టు వివరించాడు.
డ్రగ్ పెడ్లర్ మీర్జా వహీద్ దగ్గర తరుచుగా కొకైన్ కొంటున్నట్టు అబ్బాస్ ఒప్పుకున్నాడు. కొనుగోలు చేసిన కొకైన్ ను గజ్జల వివేకానంద్ డ్రైవర్… గద్దల ప్రవీణ్ కు అప్పగిస్తున్నాడు. గ్రామ్ కొకైన్ ను దాదాపు 14 వేల రూపాయలకు కొని వివేక్ కు అమ్ముతున్నాడు అబ్బాస్. రెండు గ్రాముల కోసం సయ్యద్ అలీకి డ్రైవర్ ప్రవీణ్ 32 వేల రూపాయలను గూగుల్ పే ద్వారా చెల్లించాడు. కొకైన్ సప్లయ్ చేసినందుకు వివేక్ కొంత కమిషన్ కూడా అబ్బాస్ కు ఇస్తున్నాడు. ఈ నెల 16, 18, 19, 24 తేదీల్లో కూడా గజ్జల వివేక్ కు కొకైన్ సప్లై చేసినట్టు అబ్బాస్ ఒప్పుకున్నాడు. వివేక్ డ్రగ్ పార్టీల వివరాలను… వాట్సాప్ చాటింగ్స్… గూగుల్ పే పేమెంట్స్ ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు సేకరించారు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సప్ ఛాటింగ్స్ ని కూడా గుర్తించారు.
గజ్జల వివేక్ స్నేహితులు… సహ నిందితులైన దర్శకుడు క్రిష్, సెలగం సెట్టి కేదార్, నిర్భయ్ సింధి, రఘు చరణ్, సందీప్, స్వేత, లిషి, నెయిల్ ఏడాదిగా రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు FIRలో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, A12 గా డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ బేగ్ పేర్లను యాడ్ చేశారు. డైరక్టర్ క్రిష్ ఈ శుక్రవారం పోలీసుల ముందు విచారణకు హాజరవుతున్నారు. ఆయనకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.