Krishna Express : నల్గొండలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ తప్పిన ఘోర రైలు ప్రమాదం..
నల్గొండ జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర కృష్ణ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైల్ పేను కు ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద రైలు పట్టా విరగడంతో రైలను నిలిపేశారు.

Krishna Express misses train accident in Nalgonda
నల్గొండ జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర కృష్ణ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైల్ పేను కు ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద రైలు పట్టా విరగడంతో రైలను నిలిపేశారు. పెద్ద శబ్దం రావడంతో అధికారులను ప్రయాణికులు అప్రమత్తం చేశారు. దీంతో రైలును వెంటనే నిలిపి వేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఆలేరు సమీపంలోని రైలు పట్టాలు విరిగిపోయాయి.
ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సికింద్రాబాద్ నుంచి నల్గొండ జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దం విన్న రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యి చూస్తే.. కాస్తంత దూరంలో.. రైలు పట్టాలు విరిగిపోయాయి. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును ఆలేరు స్టేషన్ లో నిలిపేశారు. వెంటనే రైలు పట్టాలకు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదాలు రైల్వే శాఖలో.. అది ఈ వేసవి సమయంలో ఎండ వేడిమి అధికంగా ఉండటంతో తరచు జరుగుతుంటాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. కాగా రైలు పట్టాలు ఎండ వల్ల విరిగిపోయాయా? ప్రమాదంలో మానవ ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.