కేటిఆర్, రకుల్ పట్టుకున్న కుక్క ఎవరిది…?
మాజీ మంత్రి కేటిఆర్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్నేహం.
సినిమా వాళ్ళతో రాజకీయ నాయకుల స్నేహం అనేది సర్వసాధారణం. దీని గురించి అతిగా ఆలోచించడం కంటే లైట్ తీసుకోవడం మంచిది. అయితే ఇందులో ఒక షరతు ఉంది. మంత్రులుగా ఉన్న వాళ్ళు హీరోయిన్లతో స్నేహం చేస్తే అది పెంట పెంట అవుతుంది. స్నేహం చేసినా చేయకపోయినా దానికి సంబంధించిన వార్త లీక్ అయినా సరే, లేదంటే ఎవరైనా రాజకీయ నాయకుడు ఆ స్నేహం చేసే నేతపై ఆరోపణలు చేసినా సరే అది బాగా చర్చల్లో ఉంటుంది. అలాంటి వ్యవహారమే… మాజీ మంత్రి కేటిఆర్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్నేహం.
ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందనే వార్తలు అప్పట్లో వచ్చాయి. ఆ స్నేహంపై అప్పటి తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సమయంలో ఆమెకు, కేటిఆర్ కు సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఒక టీవీ డిబేట్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ పేరుని కేటిఆర్ కు లింక్ చేసి రకుల్ రావు అంటూ మాట్లాడారు. దీనిపై కేటిఆర్… తన పరువుకు భంగం కలిగించే విధంగా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని హైకోర్ట్ కు వెళ్ళగా… రేవంత్ ను కోర్ట్ మందలించింది.
ఆ తర్వాత రేవంత్ కాస్త సైలెంట్ అయినా కేటిఆర్ ను వ్యతిరేకించే చాలా మంది మాత్రం వారిపై ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా చేసారు. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ని కేటిఆర్ కాపాడారు అంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఒక రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో రకుల్ ప్రీత్, కేటిఆర్ ఒక కుక్క పిల్లను పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకున్నవి రెండు కుక్కలు కాదని ఒకటే కుక్క అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య స్నేహం చాలా బలంగా ఉందని, ఒకరి ఇంటికి మరొకరు వెళ్తారని, అలా వెళ్ళినప్పుడే కుక్కతో ఫోటో దిగారని, ఇంతకు ఆ కుక్క కేటిఆర్ కు చెందిందా లేక రకుల్ ప్రీత్ కు చెందినదా అంటూ ఫొటోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు.