KTR VS REVANTH REDDY: మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్..
రేవంత్.. నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ఇద్దరం మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేద్దాం. సేఫ్ గేమ్ వద్దు. స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం. అక్కడ ఇక్కడ కాదు.
KTR VS REVANTH REDDY: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ చేసిన సవాల్‌కు మాజీ మంత్రి కేటీఆర్ ప్రతిసవాల్ విసిరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనతోపాటు మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలని రేవంత్‌కు కేటీఆర్ సవాల్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దమ్ముంటే బీఆర్ఎస్ ఒక్క సీటైనా గెలిపించుకోవాలని సీఎం రేవంత్ చేవెళ్ల సభలో వ్యాఖ్యానించారు.
Samantha Ruth Prabhu: సైకిల్ గుర్తుకు ఓటేయాలంటున్న సమంత.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో..
దీనికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ మాట్లాడారు. ఒక్క సీటే ఎందుకు.. డైరెక్ట్‌గా రేవంత్ సిట్టింగ్ ఎంపీగా కొనసాగిన మల్కాజిగిరి నుంచే పోటీ చేద్దామంటూ రేవంత్‌కే కేటీఆర్ సవాల్ విసిరారు. ‘‘రేవంత్.. నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ఇద్దరం మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేద్దాం. సేఫ్ గేమ్ వద్దు. స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం. అక్కడ ఇక్కడ కాదు. మీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం. ఒక్కసీటు మీదే కొట్లాడుదాం. దమ్ముంటే రండి. రేవంత్ కు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చెయ్.. మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం. ఒక్క సీటు గెలిచే దమ్ము ఎవరికి ఉందో తేల్చుకుందాం రా’’ అంటూ సవాల్ విసిరారు. అలాగే ‘‘మాది మేనేజ్‌మెంట్ కోటా అయితే.. రేవంత్‌ది పేమెంట్ కోటానా? రాహుల్, ప్రియాంకా గాంధీది ఏం కోటా..? పేమెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకు రేవంత్ దిల్లీకి పేమెంట్ చేయాలి. పేమెంట్ల కోసమే భవన నిర్మాణ అనుమతులు ఆపారు.
మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. పాలనలో అన్నీ సీఎం, మంత్రులకు తెలియాలని లేదు. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోండి. ఆడబిడ్డలకు రూ.2,500 సహా ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరి కేటీఆర్ సవాల్‌పై రేవంత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.