KTR: కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్.. నెటిజన్ల వైల్డ్ రియాక్షన్..
అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటు తేల్చిచెప్పారు. దీంతో.. అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
KTR: కేటీఆర్ పేరు చెప్పగానే వెనకాల ఎమ్మెల్యేలు, షేక్‌హ్యాండ్ ఇస్తే చాలు జన్మధన్యం అనుకునే కార్యకర్తలు.. వీటితో పాటు బ్లేజర్‌లో స్టైలిష్ వాక్, అద్భుతమైన ఇంగ్లిష్.. ఆ దర్పం, ఠీవీ.. ఇవే కదా సోషల్ మీడియాలో కనిపించేవి. ఐతే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అధికారపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండే కేటీఆర్.. ఓడిపోయాక ఎలా అయిపోయారు అంటూ చర్చ మొదలైంది. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవడం అంటే ఇదే బహుశా అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసి మరీ కామెంట్లు పెడుతున్నారు.
CAG Report: కాళేశ్వరంలో దోపిడీ నిజమే.. బీఆర్ఎస్ సర్కార్‌ని ఉతికారేసిన కాగ్
కాంగ్రెస్ మేడిగడ్డ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయం భగ్గుమంటోంది. అధికార, విపక్షాల మధ్య మాటలు.. తూటాలకు మించి వేగంగా పేలుతున్నాయ్. బుధవారం అసెంబ్లీ పరిణామాలతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ వాకౌట్ చేశారు. ఆ తర్వాత మీడియా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ కనిపించిన ఘటనే.. ఇప్పుడు కొత్త చర్చకు కారణం అయ్యేలా చేసింది. కేటీఆర్‌ను ఎమోషనల్ చేసి.. ఓ పోస్ట్ పెట్టేందుకు కారణం అయింది. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటు తేల్చిచెప్పారు. దీంతో.. అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో రోడ్డు మీద కేటీఆర్ కూర్చున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయ్. ఎలా ఉండే కేటీఆర్ ఎలా అయ్యారు అంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయ్. అలాంటి పోస్టులు చూశారో.. లేదంటే తనకే ప్రత్యేకంగా చెప్పాలి అనిపించిందో కానీ.. ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కేటీఆర్.
పోలీసులు అడ్డుకున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ట్వీట్ చేశారు. తమకు కొట్లాట కొత్తేమీ కాదని.. గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి.. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. చివరలో జై తెలంగాణ అంటూ రాసుకొచ్చారు. పోలీసులు అడ్డుకున్న సందర్భంలో ఫొటోలు.. ఉద్యమకాలంలో రోడ్డు మీద భోజనాలు చేసిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఆ పోస్టింగ్ కింద రకరకాలుగా కామెంట్లు కనిపిస్తున్నాయ్. అధికారం ఉన్నన్ని రోజులు అహంకారంతో జనాలను పట్టించుకోకుండా ఉంటే.. ఇలాంటి పరిస్థితులే వస్తాయని కొందరు.. పదేళ్లు హెలికాప్టర్‌లో తిరిగారు కదా.. ఇప్పుడు జనాలు పాతరోజులు గుర్తు చేశారు అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.