KTR: రేవంత్ రక్తం బీజేపీదే.. వంద రోజుల్లో హామీలు అమలు చెయ్.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్..
రేవంత్ రెడ్డీ.. బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం. కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పెట్టు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను టిఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసింది.
KTR: తమ పార్టీ బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత కానీ, ముందు వంద రోజుల్లో హామీల్ని అమలు చేయాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్, కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. “రేవంత్ రెడ్డీ.. బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం. కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పెట్టు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను టిఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసింది. రేవంత్ రెడ్డి లాంటి నాయకులను వేల మందిని బీఆర్ఎస్ పార్టీ చూసింది. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని మీలాంటోళ్లు చాలామంది నీల్గిన్రు.
అయినా రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి, నీలాంటి వాళ్ళను మట్టికరిపించింది. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్.. తెలంగాణ తెచ్చినందుక… తెలంగాణను డెవలప్ చేసినందుకా.. మిమ్ములను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా. కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయి. రేవంత్ కాంగ్రెస్ ఏక్‌నాథ్ షిండేగా మారతాడు. రేవంత్ రక్తం అంత బిజెపిదే. ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిండు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు అదాని కోసం వెంటపడుతున్నాడు. స్విట్జర్లాండ్‌లో రేవంత్ రెడ్డి అదానితో అలైబలై చేసుకున్నాడు. అదాని, రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు లోగుట్టు బయటపెట్టాలి. రాహుల్ గాంధీ ఏమో అదానీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఈరోజు రేవంత్ రెడ్డి అదాని కోసం అర్రులు చాస్తున్నాడు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్‌గా మారిండు. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దు. స్వయంగా ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలి. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల అప్పుడు చెప్పిండు. కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, 10 జన్‌పథ్‌కు పంపించాలి. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలి. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలి. మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు 2500 వెంటనే ఇవ్వాలి. ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి కాంగ్రెస్ చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదు. బిజెపితో బీఆర్ఎస్‌కు ఏరోజు పొత్తు లేదు. భవిష్యత్తులోనూ ఉండదు. సికింద్రాబాద్ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి 5 ఏండ్లలో ఏం చేసిండో చెప్పాలి. కెసిఅర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే, కిషన్ రెడ్డి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్‌లో లిప్ట్‌లను జాతికి అకింతం చేశారు.
Cyber Crimes : రూ.98 లక్షలు.. 11 బ్యాంక్ అకౌంట్లు.. హైదరాబాద్‌లో భారీ సైబర్ ఫ్రాడ్..
ఇదే అయన చేసిన అతిపెద్ద పని. బీఆర్ఎస్ కెసిఅర్ అద్వర్యంలో 36 ప్లైఒర్లు కడితే, ఉప్పల్, అంబర్ పేట ప్లై ఓవర్లు సంవత్సరాలైనా కట్టలేక చేతులెత్తెశారు. రాష్ట్రంలో బిజెపిని అడ్డుకున్నది ముమ్మాటికి టిఆర్ఎస్ పార్టీనే. బీఆర్ఎస్ పార్టీ వల్లనే బిజెపి సీనియర్ నాయకులు హైదరాబాద్ పలు నియోజకవర్గాల్లో పోటీకి వెనుకంజ వేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. రైతన్నలకు రైతుబంధు అందడం లేదు. మహిళలకు ఇచ్చిన 2500 రావడం లేదు. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. 420 హామీలు అని ప్రజలు గుర్తుంచుకోవాలి. వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా వెంటాడుతాం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.