KTR: 18 ఏళ్లు దుబాయ్‌ జైల్లో ఉండి సొంతూరికి.. కేటీఆర్‌ గురించి చెప్పింది వింటే కన్నీళ్లు ఆగవు..

తెలంగాణకు చెందిన శివరాత్రి మల్లేశ్, శివరాత్రి రవి, దుండుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు, వెంకటేశ్.. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఓ నేపాలీ గూర్ఖాను హత్య చేసిన కేసులో.. ఈ ఐదుగురికి పాతికేళ్ల జైలు శిక్ష పడింది. ఐతే కేటీఆర్ మంత్రిగా ఉన్న టైమ్‌లో వీరి శిక్ష తగ్గింపునకు కృషి చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 08:17 PMLast Updated on: Feb 21, 2024 | 8:18 PM

Ktr Helped Sircilla People In Dubai Jail To Release

KTR: దేవుడు అవ్వాలంటే.. శక్తులు ఉండాల్సిన అవసరం లేదు. తోటి మనిషి కన్నీళ్లు తుడిచినా చాలు.. దేవుడే ! కేటీఆర్ గురించి ఇప్పుడు సిరిసిల్లలో ఆ కుటుంబాలు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. 18ఏళ్లు జైల్లో మగ్గిన బతుకులు.. ఇక చావు కూడా అక్కడే అని నిర్ణయించుకున్న జీవితాలు.. గుర్తుకొస్తున్న కుటుంబం ఒకవైపు, ఇంటిని ఇక చూడలేమన్న నైరాశ్యం మరోవైపు.. ఆశకు, నిరాశకు మధ్య కొట్టుమిట్టాడుతున్న మనుషులు.. అలాంటివాళ్లు మళ్లీ హాయిగా ఊపిరి పీల్చుకుంటే.. ఆ సన్నివేశం ఊహించుకోవడానికే ఉద్విగ్నంగా ఉంటుంది కదా.

PAWAN KALYAN: జగన్.. అభివృద్ధి బటన్ నొక్కు.. ఆ మాటతో జాతీయ నేతలతో తిట్లు తిన్నా: పవన్ కళ్యాణ్

అదే జరిగింది హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో! తెలంగాణకు చెందిన శివరాత్రి మల్లేశ్, శివరాత్రి రవి, దుండుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు, వెంకటేశ్.. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఓ నేపాలీ గూర్ఖాను హత్య చేసిన కేసులో.. ఈ ఐదుగురికి పాతికేళ్ల జైలు శిక్ష పడింది. ఐతే కేటీఆర్ మంత్రిగా ఉన్న టైమ్‌లో వీరి శిక్ష తగ్గింపునకు కృషి చేశారు. గతేడాది సెప్టెంబరులో దుబాయ్‌ పర్యటన సందర్భంగా.. కేటీఆర్ అక్కడి ప్రభుత్వానికి దీనిపై విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రయత్నాల ఫలితంగా వారి క్షమాభిక్ష పిటిషన్‌కు యూఏఈ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ హత్య కేసులో శిక్ష పడిన వారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు. కేటీఆర్‌.. ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కూడా ఇదే ! దుబాయ్‌లో 18ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన మల్లేశ్, అతడి సోదరుడు రవి.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా, అక్కడ తీవ్ర భావోద్వేగ దృశ్యాలు కనిపించాయ్‌. కుటుంబ సభ్యులను కలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

దుండుగుల లక్ష్మణ్ రెండు నెలల క్రితమే తెలంగాణకు తిరిగి రాగా.. శివరాత్రి హన్మంతు రెండ్రోజుల కిందట సొంతగడ్డకు చేరుకున్నాడు. ఐదో వ్యక్తి వెంకటేశ్ వచ్చే నెలలో దుబాయ్ జైలు నుంచి విడుదల కానున్నాడు. వీరు దుబాయ్ నుంచి తెలంగాణ తిరిగొచ్చేందుకు కేటీఆర్ విమాన టికెట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 2011లో కేటీఆర్ నేపాల్‌కు వ్యక్తిగత పర్యటనపై వెళ్లి.. దుబాయ్‌లో హత్యకు గురైన గూర్ఖా కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి 15 లక్షల పరిహారం కూడా అందించారు. ఈ క్రమంలోనే గూర్ఖా కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పిటిషన్‌పై సంతకం చేసినట్టు తెలుస్తోంది.