KTR: తెలంగాణ ఆడబిడ్డల కోసం కొత్త పథకం సౌభాగ్య లక్ష్మి తెస్తాం: కేటీఆర్
. అయితే, బీఆర్ఎస్ మాకేం చేస్తుందని ఆడబిడ్డలు అడుగుతున్నారు. అత్తలకు పింఛన్లు వస్తున్నాయి. మరి మా సంగతేంటని కోడళ్లు అడుగుతున్నారు. అందుకే డిసెంబర్ 3న కోడళ్లకు కేసీఆర్ శుభవార్త చెబుతారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల కోసం సౌభాగ్య లక్ష్మి పేరుతో కొత్త పథకం తెస్తాం.
KTR: తెలంగాణ ఫలితాలు వెలువడ్డ డిసెంబర్ 3న కోడళ్లకు సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని వెల్లడించారు మంత్రి కేటీఆర్. మంచిర్యాల జిల్లా ఖానాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. “తెలంగాణ సాధించుకున్నాం కాబట్టే.. మన డబ్బులు మనం తీసుకుంటున్నాం. రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్.. ఇలా ఎన్నో పథకాలు అమలు చేసుకుంటున్నాం. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు మేనమామలా కేసీఆర్ అండగా ఉన్నారు. అనేక సమస్యలు పరిష్కరించుకున్నాం.
PM MODI: డీప్ ఫేక్ బారిన మోదీ.. వ్యవస్థకు పెను ముప్పు ఉందన్న ప్రధాని..
అయితే, బీఆర్ఎస్ మాకేం చేస్తుందని ఆడబిడ్డలు అడుగుతున్నారు. అత్తలకు పింఛన్లు వస్తున్నాయి. మరి మా సంగతేంటని కోడళ్లు అడుగుతున్నారు. అందుకే డిసెంబర్ 3న కోడళ్లకు కేసీఆర్ శుభవార్త చెబుతారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల కోసం సౌభాగ్య లక్ష్మి పేరుతో కొత్త పథకం తెస్తాం. రూ.3 వేలు ప్రతి నెలా మీ అకౌంట్లలో వేస్తాం. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చేవి. ఇప్పుడు రాష్ట్రంలో 46 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు వస్తున్నాయి. బీడీలు చేసే అక్క చెల్లెళ్లను గతంలో ఏ సీఎం పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ రూ.2 వేల పింఛన్ ఇస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో గవర్నమెంట్ హాస్పిటళ్లకు వెళ్లను బాబోయ్ అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వాసుపత్రులకే వెళ్తామంటున్నారు.
కరెంట్, సాగునీరు, తాగు నీరు, సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం. అలాంటి రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పడితే.. వారి చేతుల్లో పెడదామా..? ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి వస్తున్నారు. ఎంత మంది వచ్చినా బీఆర్ఎస్ ప్రజల మీదే భారం వేసింది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.