KTR: మాస్ వార్నింగ్.. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ చెప్పారు. హీరోయిన్లను బెదిరించారని కొందరు ఆరోపిస్తున్నారని, అలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన కర్మ తనకు పట్టలేదని అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2024 | 06:05 PMLast Updated on: Apr 03, 2024 | 6:05 PM

Ktr Sent Notices To Miniter Konda Surekha And Congress Leaders

KTR: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వంలో కొందరు పోలీస్ అధికారులు చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అప్పటి విపక్షనేతల ఫోన్లు ట్యాప్ చేసి కీలక సమాచారాలు సేకరించడంతో పాటు.. ఎందరో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి, వారి వ్యక్తిగత విషయాలు సేకరించి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

SUMMER HEAT: రేపటి నుంచి నిప్పుల కుంపటే.. హైదరాబాదీస్‌.. బీ అలర్ట్‌..

సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమని ప్రచారం జరుగుతోంది. సమంతతో పాటు ఎందరో హీరోయిన్ల ఫోన్లు అప్పుడు ట్యాప్ అయ్యాయని వార్తలొస్తున్నాయి. దీని వెనుక అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఉన్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వివాదంపై తాజాగా స్పదించిన కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ చెప్పారు. హీరోయిన్లను బెదిరించారని కొందరు ఆరోపిస్తున్నారని, అలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన కర్మ తనకు పట్టలేదని అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే తాటతీస్తానని హెచ్చరించిన కేటీఆర్.. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.

అంతేకాక తన క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రైనా.. ముఖ్యమంత్రైనా తాటతీస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే మంత్రులు కొండా సురేఖ, కేకే మహేందర్‌ రెడ్డికి కేటీఆర్‌ నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలపి కేటీఆర్‌ డిమాండ్ చేశారు.