KTR : సైడ్ అయిపోయిన కేటీఆర్.. పార్టీలో హరీష్ ఏది చెప్తే అదేనా ?
బీఆర్ఎస్ తీవ్ర కష్టాల్లో ఉంది. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా చేయి జారి పోతున్నారు. దీంతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందా అనే చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ తీవ్ర కష్టాల్లో ఉంది. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా చేయి జారి పోతున్నారు. దీంతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందా అనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారు.. కేటీఆర్ పరామర్శలు చూసుకుంటున్నారు. ఇప్పుడు పార్టీని నడిపిస్తోంది.. కార్యకర్తల్లో ధైర్యం నింపుతోంది హరీషే ! ట్రబుల్ షూటర్ అని హరీష్‌కు మంచి పేరు ఉంది. పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతీసారి..తన మార్క్ రాజకీయంతో పార్టీకి బలంగా మారారు హరీష్. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ సైడ్ అయింది.. హరీష్ స్క్రీన్ మీదకు వచ్చింది అందుకేనా అనే డిస్కషన్ వినిపిస్తోంది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడానికి… పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల ప్రోటోకాల్ కాపాడాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బృందానికి… కేటీఆరే నాయకత్వం వహించారు. ఐతే డామినేషన్ మొత్తం హరీష్‌దే కనిపించింది. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో… బీఆర్ఎస్ఎల్పీ నేత కుర్చీలో హరీష్ కూర్చుని మాట్లాడారు. కేటీఆర్ పక్కన కూర్చున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు వీడిపోవడానికి… కాంగ్రెస్ వైపు చూడటానికి కేటీఆర్ కూడా ఓ కారణం అన్ని ప్రచారం జోరుగా సాగుతోంది. దానం నాగేందర్ ఈ మధ్య ఇలాంటి మాటలే మాట్లాడారు. పార్టీని కార్పొరేట్ సంస్థలా మార్చారని.. ఆ పార్టీలో ఎవరి మాటకు విలువ ఉండదంటూ.. కేటీఆర్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఇలాంటి సమయంలో కావాలని కేటీఆర్ పక్కకు తప్పుకుంటున్నారా.. హరీష్ తెరమీదకు వస్తున్నారా అనే చర్చ జరగుతోంది.
కేటీఆర్ తీరుతోనే.. బీఆర్ఎస్ మీద ఎమ్మెల్యేలకు అటాచ్‌మెంట్ లేదు అనే కారణాలు వినిపిస్తున్నాయ్. ఎక్కువ మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు… వారితో కాస్త ఎమోషనల్ బాండింగ్ పెచుకుంటే.. కష్టాలు వచ్చినప్పుడు ఉండేవారని.. కానీ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఉండటంతో పరిస్థితి మారుతోందనే చర్చ జరుగుతోంది. పార్టీని వీడిపోతారన్నవారిపై కూడా పరుషమైన వ్యాఖ్యలు చేస్తూండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ కన్నా హరీష్ రావునే ముందు పెట్టాలన్న డిమాండ్ అంతకంతకతూ పెరుగుతోంది. దానికి తగ్గట్లే హరీష్ … యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.