KTR TWEET: కేటీఆర్‌కి దిమ్మతిరిగే షాక్.. చెల్లెలు తిహార్ జైల్లో ఉంటే.. IPL ఎంజాయ్ చేస్తున్నావా..?

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ తెచ్చుకొని పార్టీకి ఊపు ఇద్దామని చేస్తున్న ఫీట్లు బౌన్స్ అవుతున్నాయి. పార్టీ ప్రచార సభలో మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ జరిగితే జరిగి ఉండొచ్చు అని కేటీఆర్ అంగీకరించడం పార్టీని అయోమయంలో పడేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2024 | 01:11 PMLast Updated on: Mar 28, 2024 | 1:11 PM

Ktr Tweet On Srh Ipl Match Netizens Trolling

KTR TWEET: టైం మనది కానప్పుడు పై గుడ్డ కూడా పామై కరుస్తుంది. రామా అని పిలిచినా కూడా బూతులాగే వినిపిస్తుంది. కల్వకుంట్ల ఫ్యామిలీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులు దొరకట్లేదు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని కవిత తీహార్ జైల్లో కూర్చుంది. ఫోన్ టాపింగ్ కేసులో ఇరుక్కొని నా అనుకున్న వాళ్లంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. BRS పెట్టిన తర్వాత ఆ పార్టీ ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని చూస్తోంది.

Addanki Dayakar: కంటోన్మెంట్ రేసులో అద్దంకి ? ఏకగ్రీవం లేనట్టేనా ?

ఇలాంటి సమయంలో ఆచి తూచి వ్యవహరించాల్సిన పార్టీ నాయకులు నోరు జారి మరింత చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్hకి నెటిజెన్స్ దిమ్మతిరిగే షాకిచ్చారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ తెచ్చుకొని పార్టీకి ఊపు ఇద్దామని చేస్తున్న ఫీట్లు బౌన్స్ అవుతున్నాయి. పార్టీ ప్రచార సభలో మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ జరిగితే జరిగి ఉండొచ్చు అని కేటీఆర్ అంగీకరించడం పార్టీని అయోమయంలో పడేసింది. కేటీఆర్ మాటలపై జనంలో బాగా చర్చ జరుగుతోంది. ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమేనని స్వయంగా కేటీఆర్ ఒప్పుకోవడంతో.. KCR పదేళ్ల పాలనలో వీళ్ళు ఇంకెన్ని దారుణాలు చేశారో.. ప్రైవేట్ సైన్యాలను పెట్టి ఎంతమంది ఫోన్లు టాప్ చేయించి ఉంటారని అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇలాంటి టెన్షన్ లో కూడా కేటీఆర్.. ఐపీఎల్ మ్యాచ్‌పై చేసిన ట్వీట్ మరింత రచ్చ సృష్టించింది. ఉప్పల్ గ్రౌండ్లో సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్ మధ్య జరిగిన IPL టి20 మ్యాచ్ చూశాననీ.. సన్ రైజర్స్ రికార్డ్ స్థాయిలో 277 పరుగులు చేయడం సంతోషం కలిగించిందని.. హైదరాబాద్ టీమ్‌కి కంగ్రాట్స్ చెబుతూ.. తనదైన స్టైల్ లో ట్వీట్ చేశారు కేటీఆర్.

అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చేసే ట్వీట్లుకి సూపర్ రెస్పాన్స్ ఉండేది. యువరాజు ఏం చేసినా.. చుట్టూ చిడతలు కొట్టే వాళ్ళు ఉండే వాళ్ళు కాబట్టి.. ఆహా.. ఓహో అనిపించేది. కానీ IPL మ్యాచ్‌పై సన్‌రైజర్స్‌ని అభినందిస్తూ పెట్టిన ట్వీట్‌పై సిటిజన్స్ చాలా దారుణంగా కేటీఆర్‌ని ట్రోల్ చేశారు. సొంత చెల్లెలు లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొని తీహారు జైల్లో ఉంటే.. నువ్వు IPL మ్యాచ్ ఆస్వాదిస్తున్నావా? మీకు పాలిటిక్సే తప్ప ఎమోషన్స్ ఉండవా? మ్యాచ్ చూసిన వాడివి చూసినట్టు ఉండకుండా.. దాని గురించి మళ్ళీ ట్వీట్లు చేస్తున్నావా? అని ఒకరంటే.. ఫోన్ టాపింగ్ కేసు, లిక్కర్ స్కామ్, కాళేశ్వరం స్కామ్, కన్నారావ్ అరెస్ట్, చెల్లెలు తిహార్ జైలు.. నాన్న ఏమీ చేయట్లేదు.. పార్టీ దిగజారిపోతోంది.. ఇంత జరుగుతున్నా.. నీ స్పిరిట్ బాగుంది అంటూ రకరకాలుగా ఆడుకున్నారు కేటీఆర్ని నెటిజన్స్. కర్మ కాలిపోయినప్పుడు మనం ఏం చేసినా అది వంకర టింకరగానే ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా అలాగే తయారైంది.