KUMARI AUNTY: వైరల్ కుమారి అంటీపై కేసు.. అరెస్ట్..
కుమారి ఆంటీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ సెన్సేషన్‌గా మారిపోయింది. దీంతో.. యూత్ అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు క్యూ కడుతున్నారు. కిలోమీటర్లకు కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి మరీ.. కుమారి ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
KUMARI AUNTY: సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ వెండర్.. కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేమస్ అయితే కేసులు పెడతారా.. అని కన్ఫ్యూజ్ అవకండి. ఫేమస్ అయినందుకు కాదు.. ఆ ఫేమ్ వల్ల వచ్చిన కష్టానికి ఆమె మీద కేసు నమోదయింది. ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ సెన్సేషన్‌గా మారిపోయింది. దీంతో.. యూత్ అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు క్యూ కడుతున్నారు.
Smita Sabharwal: నేను.. ఆయన కలిసే ఉన్నాం.. స్మిత సబర్వాల్ పోస్ట్
కిలోమీటర్లకు కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి మరీ.. కుమారి ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి బైక్‌లు, కార్లలో వస్తున్న యువకులు.. రోడ్డు మీదే వాటిని పార్క్ చేస్తున్నారు. దీంతో రద్దీ ఎక్కువైపోయి, ఆ రూట్‌లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇది ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో.. ట్రాఫిక్ జామ్‌కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌ఆర్బిట్ మాల్ ఎదురుగా.. ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కన.. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఉంది. ఆ ఏరియా ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అలాంటిది వైరల్ ఆంటీ దగ్గరకు ఫుడ్ తినేందుకు జనాలు ఒక్కసారిగా రావడంతో మరింత రష్‌గా కనిపిస్తోంది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి ఫుడ్‌స్టాల్ కూడా ఖాళీ చేయించారు. ఈ ప్రాసెస్‌లో.. కుమారి ఆంటీ కొడుకు మీద కొందరు పోలీసులు చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే కుమారి ఆంటీ మీద కేసు వ్యవహారం.. ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతోంది. రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ కుటుంబం మీద ఇంతలా పగ పట్టాలా అని కొందరు.. పెద్దపెద్దవాళ్లను వదిలేసి ఇలాంటి వారి మీద కేసులు పెడతారా అంటూ ఇంకొందరు.. ఇలా చాలా కామెంట్లు వినిపిస్తున్నాయ్. కుమారి ఆంటీకి మద్దతుగా పోస్టులు పెడుతున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు.
దీంతో ఆంటీ మళ్లీ వైరల్ అవుతోంది. ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయికుమారి.. 2011లో స్ట్రీట్‌ఫుడ్ సెంటర్‌ను ప్రారంభించారు. వెజ్, నాన్‌వెజ్ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్‌లో కేవలం 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్.. ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతోందంట. ఐతే అక్కడి జనాలు ఎక్కువగా ఆమె దగ్గరికి వస్తుండటం గమనించిన కొందరు ఫుడ్ వ్లాగర్స్.. ఆమెపై వీడియోలు తీసి పెట్టటంతో.. యూట్యూబ్‌లో ఇప్పుడు ఆమె ఓ సెన్సెషన్‌గా మారిపోయింది. ఆ వీడియోలు వైరల్ అవుతుండటంతో.. కేవలం యువతే కాదు.. సినిమా సెలబ్రెటీలు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తున్నారంటే.. ఆమె ఎంతగా ఫేమస్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు.