KUMARI AUNTY: ఈ వైరల్ ఆంటీ సంపాదన తెలిస్తే షాక్‌…

ఫుడ్‌ సేల్ చేస్తున్న ఓ ఆంటీ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్నో రకాల నాన్‌వెజ్‌ వంటకాలను తక్కువ ధరకే అందిస్తూ.. ఫుడ్‌ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆమే.. కుమారి అంటీ. ఆమె అసలు పేరు.. దాసరి సాయికుమారి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 21, 2024 | 01:42 PMLast Updated on: Jan 21, 2024 | 1:42 PM

Kumari Aunty Food Videos Viral Do You Know How Much She Earns Month

KUMARI AUNTY: హైదరాబాద్‌ అంటే గుర్తొచ్చేది బిర్యానీ. అయితే, ఇప్పుడిప్పుడు స్ట్రీట్‌ ఫుడ్ కూడా తెగ ఫేమస్ అవుతోంది. ఇలాంటి ఫుడ్‌ సేల్ చేస్తున్న ఓ ఆంటీ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్నో రకాల నాన్‌వెజ్‌ వంటకాలను తక్కువ ధరకే అందిస్తూ.. ఫుడ్‌ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆమే.. కుమారి అంటీ. ఆమె అసలు పేరు.. దాసరి సాయికుమారి. ఏపీలోని గుడివాడ వీళ్ల సొంతూరు. 2011లో స్ట్రీట్‌ఫుడ్‌ సెంటర్‌ స్టార్ట్ చేశారు.

AKHIL PAILWAN: బయటకొస్తున్న అఖిల్‌ పహిల్వాన్ బాగోతాలు.. ఫోన్ నిండా అవే..

హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా.. స్ట్రీట్‌ఫుడ్‌ బిజినెస్‌ పెట్టుకున్నారు. తక్కువ ధరకే రుచికరమైన వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను అందిస్తూ ఆమె ఎంతో ఫేమస్‌ అయ్యారు. ముందు 5 కేజీలతో ప్రారంభమైన కుమారి ఫుడ్‌ బిజినెస్‌.. ప్రస్తుతం రోజుకు క్వింటాలుకు పైగా అమ్ముడుపోయే స్థాయికి చేరింది. కొందరు యూట్యూబ్‌ ఫుడ్‌ వ్లాగర్స్‌ వరుసగా ఆమెపై వీడియోలు చేయడంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ ట్రెండింగ్‌లోకి వచ్చారు. వెజ్‌, నాన్‌వెజ్‌.. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్.. కుమారి విక్రయిస్తుంటారు. హోటల్స్, రెస్టారెంట్లతో పోలిస్తే తన దగ్గర తక్కువ ధరకే ఫుడ్ దొరుకుతుందని అంటోంది కుమారి. నాన్‌వెజ్‌లో కర్రీతో కాకుండా ఫ్రై ఐటెమ్‌ తీసుకుంటే ప్లేటుకు 150 రూపాయలు చెల్లించాలి. వెజ్‌ మాత్రమే తింటే ప్లేటు 80 అవుతుంది. అదీ అన్‌లిమిటెడ్ అన్నమాట. రోజుకు 6వందల నుంచి 7వందల మంది తమ దగ్గర ఫుడ్ తింటారని చెప్తోంది కుమారి ఆంటీ. ఇలా రోజుకు 30 వేల వరకూ వ్యాపారం జరుగుతోంది. అన్ని ఖర్చులు పోనూ నెలకు 2 లక్షల 50వేల నుంచి 3 లక్షల వరకు ఆమెకు లాభం ఉంటుందట.

ఇక్కడ ఆహారాన్ని తినేందుకు హైదరాబాద్‌ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫుడ్‌ లవర్స్‌ వస్తున్నారు. కుమారి ఫుడ్ గురించి యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకొని మరీ వెళ్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు మించి కుమారి ఆంటీ సంపాదిస్తుండంతో… సోషల్‌మీడియాలో వైరల్‌గా మారారు. చాలామంది నెటిజన్లు ఆమెతో తమ జీవితాన్ని పోల్చుకుంటూ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంత చదువు చదివి 20, 30 వేలకు పనిచేయడం కన్నా ఆమెలాగా ఫుడ్‌కోర్టు పెట్టుకుంటే లైఫ్‌లో సెటిల్‌ అవ్వొచ్చని పోస్టులు పెడుతున్నారు.