Kurchi Thatha: కుర్చీ తాతకు కేన్సర్.. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే..
కొన్ని రోజు క్రితం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. కొంత కాలంగా అనారోగ్యంగా ఉండటంతో కుర్చీతాత కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయన కేన్సర్ బారిన పడ్డట్టు నిర్ధారించారు.

Kurchi Thatha: ఆ కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్‌తో ఫేమస్ ఐన కుర్చీ తాత అలియాస్ షేక్ అహ్మద్ పాషా కేన్సర్ బారిన పడ్డాడు. కొంత కాలంగా అనారోగ్యంగా ఉండటంతో కుర్చీతాత కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయన కేన్సర్ బారిన పడ్డట్టు నిర్ధారించారు. యూట్యూబ్ వీడియోల ద్వారా ఫేమస్ ఐన కుర్చీతాత హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్, యూసుఫ్‌గూడ ఏరియాల్లో భిక్షాటన చేస్తూ బతికేవాడు.
Arvind Dharmapuri: నియంత అర్వింద్ వెళ్లిపో.. నువ్ మాకొద్దు.. బీజేపీ నేతల తిరుగుబాటు..
అలా వచ్చిన డబ్బుతో మందు సిగరెట్లు తాగుతూ జీవితాన్ని గడిపేసేవాడు. ఇంటర్నెట్‌లో కుర్చీ డైలాగ్ ఫేమస్ అవ్వడంతో చాలా మందికి ఆనయ తెలిశారు. రీసెంట్‌గా గుంటూరు కారం సినిమాలోని ఓ సాంగ్‌లో కూడా ఈ కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్ వాడారు. దీంతో తాత ఇంకా ఫేమస్ ఐపోయాడు. అప్పటి నుంచి కొన్న యూట్యూబ్ ఛానెల్స్ కూడా కుర్చీ తాతను ఇంటర్వ్యూ చేశాయి. కుర్చీతాతను హైదరాబాద్‌లో ఎవరైతే చేరదీశారో చివరకూ వాళ్లతోనే వైరం పెట్టుకున్నాడు అహ్మద్ పాషా. దీంతో వాళ్లు ఆయనపై కేస్ పెట్టారు. పోలీసులు కుర్చీ తాతను అరెస్ట్ కూడా. ఆ తరువాత విడిచిపెట్టినప్పటికీ.. అప్పటి నుంచీ కుర్చీతాత ఎక్కడా కనిపించలేదు. వరంగల్ వెళ్లిపోయాడని అంతా అనుకున్నారు.
కానీ ఇక్కడే అక్కడక్కడా తిరుగుతూ గడిపేశాడు కుర్చీతాత. కొన్ని రోజు క్రితం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్లడంతో ఆయనకు కేన్సర్ వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ హాస్పటల్‌లో కుర్చీ తాతకు ట్రీట్‌మెంట్ జరుగుతోంది. ఆయన పరిస్థితి ప్రస్తుతం కాస్త విషమంగానే ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు.