STUDENT SUCCESS: పెద్దల్ని, పెళ్లిని ఎదిరించింది.. విజేతగా నిలిచింది.. నువ్ సూపర్ తల్లీ..
పెద్దలను, పెళ్లిని ఎదురించి.. చదువే లక్ష్యం అని కష్టపడి.. ఇప్పుడు స్ఫూర్తిగా నిలిచింది నిర్మల. పదో తరగతి తర్వాత.. నిర్మలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. చదివించలేమని… దగ్గరలో ఇంటర్ కాలేజీ కూడా లేదని కూతురిని ఒప్పించే ప్రయత్నం చేశారు.
STUDENT SUCCESS: సాధించాలని గట్టిగా అనుకోవాలనే కానీ.. కష్టం కూడా కాళ్లకు దండం పెడుతుంది. సంకల్పం ముందు ఏ కష్టం పెద్దది కాదు.. ఏ కన్నీరు సంకల్పాన్ని చెరపలేదు. ఈ మాటలకు నిలువెత్తు అద్దంలా కనిపిస్తోందా అమ్మాయి. ఆమె విజయం.. కోట్ల మందికి స్ఫూర్తినిస్తోంది. ఆమె జీవితం, కష్టం.. తలుచుకుంటే చాలు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. ఇది ఓ అమ్మాయి కథ. కాదు కాదు ఓ విజేత కథ. ఈ అమ్మాయి పేరు నిర్మల. ఊరు కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివనం.
Raghu Rama Krishna Raju: రఘురామకు లైన్ క్లియర్..? అనపర్తి, నరసాపురం టీడీపీకే
ఇంటర్ పరీక్షల్లో 440 మార్కులకు 421 సాధించి టాపర్‌గా నిలిచింది. పెద్దలను, పెళ్లిని ఎదురించి.. చదువే లక్ష్యం అని కష్టపడి.. ఇప్పుడు స్ఫూర్తిగా నిలిచింది నిర్మల. పదో తరగతి తర్వాత.. నిర్మలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. చదివించలేమని… దగ్గరలో ఇంటర్ కాలేజీ కూడా లేదని కూతురిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఐతే చదువును వదిలేది లేదని.. పట్టిన పట్టు వీడని నిర్మల పడిన కష్టం.. ప్రతీ ఒక్కరిని మనసులను మెలేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని కలిసి తన కష్టం చెప్పుకుంది. బాలిక దీనస్థితి చూసి కదిలిపోయిన ఎమ్మెల్యే.. జిల్లా కలెక్టర్‌కు విషయం చెప్పారు. కలెక్టర్ జోక్యం చేసుకొని ముందుగా నిర్మలను బాల్య వివాహం నుంచి కాపాడారు. ఆ తర్వాత ఆలూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చేర్పించారు. ఆ తర్వాత నిర్మల బైపీసీ ఫస్ట్ ఇయర్‌లో అడ్మిషన్ తీసుకుంది. ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో 440 మార్కులకు 421 మార్కులను సాధించి టాపర్‌గా నిలిచింది.
బాల్య వివాహం నుంచి బయటపడిన నిర్మల టాపర్‌గా నిలవటంపై ప్రతీ ఒక్కరు అభినందలు గుప్పిస్తున్నారు. నిర్మలను ప్రశంసిస్తూ.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఐపీఎస్ కావాలన్నది తన కల అని.. బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేస్తానని.. తనలాంటి ఆడపిల్లల కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పాటు అందిస్తానని నిర్మల చెప్తున్న మాటలు ప్రతీ ఒక్కరికి మేలుకొలుపుగా మారుతున్నాయ్. కావాల్సిన డ్రెస్సులు కొనివ్వలేదని.. అనుకున్న కాలేజీలో చేర్పించలేదని.. చదువుకు ఎగనామం పెడుతూ భవిష్యత్‌ను చీకట్లోకి నెడుతున్నవాళ్లున్న ఈ తరుణంలో.. నిర్మల జీవితం చాలామందికి పాఠం. ఆమె జీవితం, కష్టం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తి అనడంలో ఎలాంటి అనుమానం లేదు.