Sri Lanka: బిగినర్స్ మిస్టేక్స్ ఇయన్నీ.. చూసుకోవాలి కదా
ఆసియా కప్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగే ప్రమాదాన్ని డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక తప్పించుకుంది.

Kushal Mendis was given the 'Player of the Match' award as Sri Lanka secured a berth in the Super 4, which avoided defeat.
ఆసియా కప్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగే ప్రమాదాన్ని డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక తప్పించుకుంది. ఆ జట్టును వణికించిన అఫ్గానిస్తాన్ కొద్దిలో సూపర్–4 బెర్త్‌ను దూరం చేసుకుంది. స్టార్టింగ్‌లో అద్భుతంగా ఆడినా ఆఖర్లో తడబడింది. మంగళవారం జరిగిన గ్రూప్–బి చివరి మ్యాచ్‌లో లంక నిర్దేశించిన 292 రన్స్ టార్గెట్‌ను అఫ్గాన్ 37.1 ఓవర్లలో ఛేజ్ చేస్తే సూపర్4 చేరుకునేది. ఛేజింగ్‌లో అద్భుతంగా ఆడిన అఫ్గాన్ 37 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 289 రన్స్ చేసింది. మరో బాల్‌కు మూడు రన్స్ కొడితే సూపర్4 బెర్త్ దక్కేది. కానీ, ఈ బాల్‌కు ముజీబుర్ డకౌట్ గా వెనుతిరిగాడు. మరో మూడు బాల్స్‌లో ఆరు రన్స్ కొడితే టోర్నీలో ముందుకెళ్లే అవకాశం ఉండగా.. ఫజల్‌హక్ కూడా సున్నా పరుగులకే చేతులెత్తేశాడు. దాంతో, 37.4 ఓవర్లలో 289 రన్స్‌కు ఆలౌటైన అఫ్గాన్ 2 రన్స్ తేడాతో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది.
ఓటమి తప్పించుకున్న శ్రీలంక సూపర్4 బెర్తు దక్కించుకుంది. మహ్మద్ నబీ (65), హష్మతుల్లా షాహిది (59), రెహమత్ షా (45), రషీద్ (27 నాటౌట్) గా పోరాడినా అఫ్గాన్ నెగ్గలేకపోయింది. లంక బౌలర్లలో రజిత 4 వికెట్లు తీశాడు. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 స్కోరు చేసింది. కుశాల్ మెండిస్ 84 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92 పరుగులతో చెలరేగాడు. కుశాల్ మెండిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గ్రూప్–ఎ నుంచి ఇండియా, పాక్. గ్రూప్–బి నుంచి లంక, బంగ్లాదేశ్ లు సూపర్–4 చేరుకున్నాయి. మరోవైపు సూపర్–4, ఫైనల్ మ్యాచ్‌లను హంటన్‌టోటాకు తరలించాలని భావించిన ఏసీసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మ్యాచ్‌లు కొలంబోలోనే జరుగుతాయి.