Nayanatara : 50 సెకన్ల యాడ్ కోసం అన్ని కోట్లా..
లేడి సూపర్ స్టార్ (Lady Superstar) నయనతార (Nayanthara) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. తెలుగు, తమిళ భాషలలో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గానే ఎదిగింది..

Lady Superstar Nayanthara needs no special introduction..
లేడి సూపర్ స్టార్ (Lady Superstar) నయనతార (Nayanthara) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. తెలుగు, తమిళ భాషలలో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గానే ఎదిగింది..
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్‌లోనూ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్‌గా (Most Powerful Woman) తన క్రేజ్ కంటిన్యూ చేస్తోంది. ప్రజెంట్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో విపరీతమైన క్రేజ్ తో దూసుకుపోతున్న నయన్‌కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కేవలం 50 సెకన్ల యాడ్ కోసం.. నయనతార 5కోట్లు తీసుకుందన్న టాక్ ఇప్పుడు ఫిలిం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఎవరు ఔనన్నా.. కాదన్నా సౌత్ సినీ ఇండస్ట్రీలో (South Cine Industry) నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే నయనతార పేరే వినిపిస్తోంది. ఇక.. రీసెంట్‌గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’తో బాలీవుడ్‌లో కూడా డెబ్యూ ఇచ్చింది. హిందీలో తను నటించిన మొదటి సినిమాతోనే ఏకంగా షారుఖ్ ఖాన్‌లాంటి పెద్ద హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ భామ ఆ చిత్రంతో మంచి విజయాన్ని కూడా అందుకుంది. అయితే.. ఓ వైపు ప్లాప్‌లు పలకరిస్తున్నా సరే.. మరో వైపు తన సినిమాల గ్రాఫ్, క్రేజ్‌ను పెంచుకుంటూ పోతూ అందరికీ షాకిస్తున్న నయన్.. ఇప్పుడు మరొక షాకిచ్చింది. నయన్ కమర్షియల్ అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ ఏకంగా 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందన్న టాక్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
జవాన్ సినిమా రిలీజైనప్పుడు నయనతార పారితోషికం హాట్ టాపిక్‌గా మారింది. షారుక్ ఖాన్‌తో నటించేందుకు దాదాపు 10 కోట్ల వరకు నయన్ డిమాండ్ చేసింది. నయన్ క్రేజ్ చూసిన మేకర్స్ ఆమె అడిగినంత ఇచ్చేశారు. కాగా.. వరుస సినిమాల కారణంగా కొద్దిరోజులుగా యాడ్స్‌కు దూరంగా ఉన్న నయన్.. రీసెంట్‌గా టాటా స్కై, స్లైస్ యాడ్స్‌లో నటించింది. ఈ ప్రకటనల్లో నటించడానికి రూ.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుందని తెలియడంతో అందరూ షాకవుతున్నారు. కేవలం 50 సెకండ్ల నిడివి ఉండే ఒక్కో యాడ్ కోసం 5 కోట్లా అంటూ నోళ్లెళ్లబెడుతున్నారు. ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అదీ నయనతారకు ఉన్న డిమాండ్ అని.. దటీజ్ ది పవర్ ఆఫ్ లేడీ సూపర్ స్టార్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.