Pakistan: పాకిస్తాన్‌కు మరో చిక్కు.. లాహోర్ నుంచి జనం పరుగులు
ఇటీవల గాలి నాణ్యతా ప్రమాణాల్లో లాహోర్ అట్టడుగున ఉంది. అంటే.. ప్రపంచ కాలుష్య ర్యాకింగ్స్‌లో లాహోర్ మొదటి స్థానంలో ఉందంటే అక్కడ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Pakistan: పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ను ఇప్పుడు మరో కీలక సమస్య వెంటాడుతోంది. పాకిస్తాన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన లాహోర్ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఇటీవల గాలి నాణ్యతా ప్రమాణాల్లో లాహోర్ అట్టడుగున ఉంది. అంటే.. ప్రపంచ కాలుష్య ర్యాకింగ్స్‌లో లాహోర్ మొదటి స్థానంలో ఉందంటే అక్కడ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ కంటే ఎక్కువ కాలుష్యం ఆ నగరాన్ని వెంటాడుతోంది.
MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థత.. ప్రచార వాహనం పైనే పడిపోయిన కవిత
పైగా చలికాలం కావడంతో పొగమంచుతో తీవ్ర సంక్షోభం తలెత్తింది. దీనివల్ల లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి దెబ్బతింటుంది. పొగమంచు, కాలుష్యం కారణంగా లాహోర్ నగరంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. చాలా మంది ప్రజలు విషపూరితమైన గాలి పీల్చుకోవడం వల్ల శ్వాస కోస సమస్యలు, చర్మ వ్యాధులు, కంటి జబ్బులతో బాధపడుతున్నారు. నగరంలో కాలుష్యం కారణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. దీంతో చాలా మందికి ఉపాధి కరువైంది.
అటు వాయు కాలుష్యం, అనారోగ్య సమస్యలు, ఉపాధి కొరత కారణంగా కొందరు లాహోర్ విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చర్యలకు దిగింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. లాహోర్‌తోపాటు పాక్‌లోని పంజాబ్‌లో కాలుష్యం ప్రభావం కొనసాగుతోంది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఇండియాలాగే పాకిస్తాన్‌లో కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో కాలుష్యం ఇలాగే ఉంటుంది.
కాలుష్యానికి సంబంధించి ఐక్యూఎయిర్ అనే కంపెనీ కాలుష్య కారక నగరాలు, వాటి నాణ్యత గురించి జాబితా వెల్లడిస్తుంది. ఈ సంస్థ నివేదిక ప్రకారం.. లాహోర్ వాయు కాలుష్యం.. అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ప్రమాదకర 470గా ఉంది. ఇది ఢిల్లీలో 302, కరాచీలో 204గా ఉన్నాయి.