Pawan Kalyan : పిఠాపురంలో భారీగా పెరిగిన భూముల ధరలు..
పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటూ పిఠాపురం రేంజ్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడి నుంచి పోటీ చేసి గెలవడంతో.. ఇప్పుడు పిఠాపురం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది.
పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటూ పిఠాపురం రేంజ్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడి నుంచి పోటీ చేసి గెలవడంతో.. ఇప్పుడు పిఠాపురం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది. పిఠాపురంతో ఏం సంబంధం లేనివాళ్లు కూడా ఇప్పుడు అక్కడ ఉండేందుకు ఇష్ట పడుతున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భూమి కొనుగోలు చేయడంతో.. ఒక్కసారిగా పిఠాపురంలో భూముల రేట్లు పెరిగిపోయాయి.
పవన్ కళ్యాణ్‌కు సమీపంలో భూములు కొనేందుకు రియల్టర్లు ఎగబడుతున్నారు. ఒకప్పు 50 లక్షలు పలికిన భూములు ఇప్పుడు కోటిన్నర నుంచి రెండు కోట్లు పలుకుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన తరువాత తాను పిఠాపురంలోనే ఉంటానని గతంలోనే పవన్ కళ్యాన్ చెప్పారు. ఇప్పుడే అదే మాట మీద అక్కడ భూమి తీసుకున్నారు. పిఠాపురం-గొల్లప్రోలు టోల్‌ప్లాజా పక్కనే ఉన్న వ్యవసాయ భూమిని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తం 3.52 ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. 1.44 ఎకరాలు ఒక డాక్యుమెంట్‌గాను, 2.08 ఎకరాల భూమిని రెండో డాక్యుమెంట్‌గా రిజిస్ట్రేషన్ జరిగింది.
ఇల్లు క్యాంపు కార్యాలయంతోపాటు, హెలిప్యాడ్, అలాగే కార్యకర్తల సమావేశాలకు భారీగా హాలు కూడా ఈ స్థలంలోనే నిర్మించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి పవన్ 18 ఎకరాల వరకూ భూమిని ఇదే పరిసర ప్రాంతంలో కొనుగోలు చేసి భారీ నిర్మాణం చేపట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. పవన్ భూమి కొనుగోలు చేయడంతో ఆ ప్రాంతంలో రియల్‌ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎంత ఖర్చైనా సరే అదే ప్రాంతంలో భూమిని సొంతం చేసుకునేందుకు రియల్టర్లు రైతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.