Badrinath Landslides : బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగిపడ్డ కొండచరియలు.. ఒళ్లు గగుర్లు పుట్టించే వీడియో వైరల్
దేవ భూమిగా పేరు ఉన్న ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. వరదల అక్కడి ప్రజలను.. టూరిస్టులను కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Landslides on Badrinath National Highway.. Shocking video viral
దేవ భూమిగా పేరు ఉన్న ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. వరదల అక్కడి ప్రజలను.. టూరిస్టులను కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హిమలయా రాష్ట్రం అయిన ఉత్తరాఖండ్ లో ఉన్న పంచ ప్రయాగ్ లన్ని కూడా వరద నీరు భారీగా పెరుగుతుంది. దీంతో పంచప్రయాగ్ నదులన్ని కూడా హరిద్వార్ లో ఉన్న గంగా నదిలో కలిసి రిషికేష్, హరిద్వార్ లో గంగా నది నీటి మట్టం అంచలంచలుగా పేరిగిపోతుంది. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోని బిక్కు బిక్కు మంటున్నారు. మరో వైపు భారీ వర్షాలు, వరదలకు తోడు.. కేధార్ నాథ్, బద్రినాథ్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో చార్ధామ్ యాత్రికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ కొండచరియలు విరిగి పడుతున్న సమయంలో కొందరు యాత్రికులు కూడా దూర్మరణంపాలయ్యారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్ లో జరిగింది..
ఉత్తరాఖండ్ చమోలీలోని జోషిమఠ్ వద్ద తాజాగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ జాతీయ రహదారిపై ప్రజలు చూస్తుండగానే కొండచరియలు విరిగిపడ్డాయి. కళ్ళ ముందు ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో మరిన్ని కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అక్కడి బద్రినాథ్ హైవేను అధికారులను మూసివేశారు. రుద్రప్రయాగ్ – కేదార్నాథ్ జాతీయ రహదారిపై కూడా రాకపోకలు నిలిపివేసినట్లు వెల్లడించారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా రెండు రోజుల ముందు.. ఉత్తరాఖండ్ లోని కేధార్ నాథ్, బద్రినాథ్ యాత్ర చేస్తుకొని తిరిగి వస్తున్న తెలంగాణ యాత్రికులు మృతి చెందారు.
ఇక వివారాల్లోకి వెళితే…
చమోలీ జిల్లాలో జరిగిన ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై శనివారం బద్రినాథ మార్గంలో కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కొల్పోయారు. ఇద్దరు ఈ ప్రమాదం దాటికి వాళ్ళ బాడీలు బండరాళ్ల కింద పడి నుజ్జు నుజ్జు అయ్యాయి. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వాసులైన నిర్మల్ షాహీ (36), సత్య నారాయణ (50)… దీంతో వారి బాడీలను స్వస్థలం హైదరాబాద్ కు తరలించే స్థితిలో లేకపోవడంతో.. వారి అంత్యక్రియలు కూడా అక్కడే చేశారు అధికారులు.. ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.