కల్కీతో పోటీ పడి నిలిచిన లాప్టా లేడీస్
వచ్చే ఏడాది ప్రపంచ సినీ అవార్డుల పండగ అయిన ఆస్కార్ అవార్డులకు... లాప్టా లేడీస్ సినిమా నామినేట్ అయింది. కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది ప్రపంచ సినీ అవార్డుల పండగ అయిన ఆస్కార్ అవార్డులకు… లాప్టా లేడీస్ సినిమా నామినేట్ అయింది. కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కార్‌కి మన దేశం నుంచి లాప్టా లేడీస్ సినిమాను ఎంపిక చేసారని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం చెన్నైలో ప్రకటించింది. 29 చిత్రాలు పోటీ పడగా లాప్టా లేడీస్ ఒకటే పోటీలో నిలిచింది. చాలా మంది… ఇందులో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సహా పలు సినిమాలు ఉన్నాయి. కల్కీ సినిమా కూడా ఆస్కార్ బరిలో ఉంటుందని భావించారు.
97వ ఆస్కార్ వేడుకకు మన దేశం నుంచి పోటీ పడుతున్న సినిమాల్లో పన్నెండు హిందీ సినిమాలు, 6 తమిళం మరియు 4 మలయాళ చిత్రాలు ఉన్నాయి. హను-మాన్, కల్కి 2898 AD, యానిమల్, చందు ఛాంపియన్, సామ్ బహదూర్, స్వాతంత్ర్య వీర్ సావర్కర్, గుడ్ లక్, ఘరత్ గణపతి, మైదాన్, జోరం, కొట్టుకాళి, జామా, ఆర్టికల్ 370, ఆటం, ఆడుజీవితం వంటి సినిమాలు ఉన్నాయి. లాప్టా లేడీస్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహిళల జీవితాన్ని కళ్ళకు హత్తుకునేలా చూపించింది చిత్ర యూనిట్.
కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు… ఆమె మాజీ భర్త, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించారు. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన పలు విషయాలను ఈ సినిమాలో చూపించారు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా ద్వారా ప్రతిభా రంతా, నితాన్షి గోయెల్ సహా పలువురు తెరంగేట్రం చేసారు. ఈ సినిమాను 48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శించడం సంచలనం. విమర్శకులు సైతం ప్రసంశలు కురిపించిన ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళడంతో కిరణ్ రావు ఆనందానికి అవధులు లేవు.