గంభీర్ కు చివరి ఛాన్స్ ? భారత్ కోచ్ కు బీసీసీఐ అల్టిమేటం

భారత క్రికెట్ జట్టు 2024ను ఓటమితో ముగించింది. బాక్సింగ్ డే టెస్టులో డ్రా చేసుకునే ఛాన్స్ వచ్చినా బ్యాటర్ల వైఫల్యంతో ఓడిపోయింది. నిజానికి ఈ సిరీస్ ఆద్యంతం బ్యాటింగ్ వైఫల్యమే టీమిండియాకు మైనస్ గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 03:21 PMLast Updated on: Jan 02, 2025 | 3:21 PM

Last Chance For Gambhir Bcci Ultimatum To India Coach

భారత క్రికెట్ జట్టు 2024ను ఓటమితో ముగించింది. బాక్సింగ్ డే టెస్టులో డ్రా చేసుకునే ఛాన్స్ వచ్చినా బ్యాటర్ల వైఫల్యంతో ఓడిపోయింది. నిజానికి ఈ సిరీస్ ఆద్యంతం బ్యాటింగ్ వైఫల్యమే టీమిండియాకు మైనస్ గా మారింది. మెల్ బోర్న్ లో పిచ్ మరీ బౌలర్లకు అనుకూలంగా లేకున్నా కూడా మన సీనియర్ బ్యాటర్లు ఎవ్వరూ క్రీజులో నిలవలేకపోయారు. వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే జనవరి 3 నుంచి జరగబోయే సిడ్నీ టెస్ట్ గంభీర్ కు లిట్మస్ టెస్టుగా మారింది. నిజానికి ద్రావిడ్ తర్వాత కోచ్ గా బాధ్యతలు అందుకున్న గంభీర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా బీసీసీఐ ముందు పలు డిమాండ్లు పెట్టి వాటిని సాధించుకున్న గంభీర్ ఆశించిన ఫలితాలు చూపించలేకపోతున్నాడు.

హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత భార‌త జ‌ట్టు చ‌రిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని ప‌రాజ‌యాల‌ను చ‌విచూస్తోంది. గంభీర్ శ్రీలంక ప‌ర్య‌ట‌న‌తో కోచ్‌గా బాధ్య‌త‌లు అందుకోగా.. అక్కడ టీ20 సిరీస్ గెలిచిన‌ప్ప‌టికి వ‌న్డే సిరీస్‌లో భార‌త్ ఓడిపోయింది. సినీయ‌ర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు ఆడినా భార‌త్ ఓడిపోవ‌డాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. 27 ఏళ్ల త‌రువాత భార‌త జ‌ట్టు శ్రీలంక‌లో వ‌న్డే సిరీస్ ను కోల్పోయింది. తర్వాత సొంతగడ్డపై మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో వైట్ వాష్ కు గురైంది. 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోవడంతో గంభీర్ కోచింగ్ సామ‌ర్థ్యం ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. అటు మాజీ క్రికెట‌ర్లు, ఇటు అభిమానులు గంభీర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఇప్పుడు బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని కూడా భార‌త్ కోల్పోతే గంభీర్ త‌న స్థానాన్ని నిల‌బెట్టుకోవ‌డం క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కోచ్‌గా అత‌డు జ‌ట్టుకు అందించిన విజ‌యాల కంటే ఘోర ఓట‌ములు ఎక్కువ‌గా ఉండ‌డం అత‌డి భ‌విష్య‌త్తును ప్ర‌శ్నార్థకంగా మారుస్తున్నాయి. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదిక‌గా జ‌న‌వ‌రి 3 నుంచి ప్రారంభం కానున్న‌టెస్టు మ్యాచ్ ఫ‌లితం పైనే గంభీర్ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉందని అంటున్నారు. ఈ మ్యాచ్‌లో భార‌త్ గెలిచి సిరీస్‌ను 2-2తో స‌మం చేస్తే ఓకే గానీ.. ఒక‌వేళ టీమ్ఇండియా ఓడిపోతే డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ రేసు నుంచి త‌ప్పుకుంటుంది. అప్పుడు బీసీసీఐ ఈ ఓట‌మిని సిరీస్‌గా తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. గంభీర్‌ను టెస్టు జ‌ట్టు కోచింగ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించే అవ‌కాశం ఉన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.