యోగిని చంపేస్తామంటూ లారెన్స్‌ గ్యాంగ్‌ లెటర్‌ అసలు కారణం ఏంటంటే

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రోజు రోజుకూ రెచ్చిపోతోంది. మొన్నటి వరకూ తమ ప్రత్యర్థులను మాత్రమే టార్గెట్‌ చేసిన ఈ గ్యాంగ్‌ ఇప్పుడు తమ ఉనికిని చాటుకునేందుకు రాజకీయ నాయకులకు కూడా టార్గెట్‌ చేస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి సిద్ధిఖీ హత్యతో దేశవ్యాప్తంగా లారెన్స్‌ గ్యాంగ్ పేరు మార్మోగిపోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 3, 2024 | 05:35 PMLast Updated on: Nov 03, 2024 | 5:35 PM

Lawrences Gang Letter Was The Real Reason For Killing Yogi

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రోజు రోజుకూ రెచ్చిపోతోంది. మొన్నటి వరకూ తమ ప్రత్యర్థులను మాత్రమే టార్గెట్‌ చేసిన ఈ గ్యాంగ్‌ ఇప్పుడు తమ ఉనికిని చాటుకునేందుకు రాజకీయ నాయకులకు కూడా టార్గెట్‌ చేస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి సిద్ధిఖీ హత్యతో దేశవ్యాప్తంగా లారెన్స్‌ గ్యాంగ్ పేరు మార్మోగిపోతోంది. ఇదిలా కంటిన్యూ అవుతుండగానే బిహార్‌ ఎంపీ పప్పూ యాదవ్‌ను చంపేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చి మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది లారెన్స్‌ గ్యాంగ్‌. అలాంటి కరడుగట్టిన క్రిమినల్‌ గ్యాంగ్‌ ఇప్పుడు ఏకంగా యూపీ సీఎం యోగీ ఆధిత్యానాథ్‌ను టార్గెట్‌ చేసింది. యోగిని చంపేస్తామంటూ లారెన్స్‌ గ్యాంగ్‌ నుంచి ముంబై పోలీసులకు ఓ బెదిరింపు లెటర్‌ వచ్చింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగీ ఆధిత్యానాథ్‌ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి. లేదంటే ఆయనను చంపేస్తాం. సిద్ధిఖీని ఎలా చంపేశామో అలాగే పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చేస్తామంటూ లెటర్‌ రాశారు. అసలు యోగిని ఎందుకు టార్గెట్‌ చేశారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి చెప్పలేదు.

కానీ లారెన్స్‌ గ్యాంగ్‌ నుంచి వచ్చిన ఈ లెటర్‌తో ఇప్పుడు మరోసారి అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. కానీ ఇప్పటి వరకూ లారెన్స్‌ టార్గెట్‌ చేసిన మిగతా వ్యక్తులు వేరు.. యోగీ ఆధిత్యానాథ్‌ వేరు. యోగీ సీఎం అవ్వకముందు యూపీలో పరిస్థితి వేరుగా ఉండేది. జేబుల్లో గన్నులు పెట్టుకుని పట్టపగలే తిరిగే గ్యాంగ్‌లు చాలా ఉండేవి. యోగీ రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో కూడా ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పార్లమెంట్‌ సాక్షిగా యోగీ తాను ఎదుర్కుంటున్న ఇబ్బందులు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను సీఎం అయ్యాక పరిస్థితి మార్చేస్తానంటూ శపథం కూడా చేశాడు. అన్నట్టుగానే తాను సీఎం అయ్యాక గ్యాంగ్‌స్టర్లు అందర్నీ ఏరుకుంటూ రావడం మొదలు పెట్టాడు. ఏ స్థాయిలో వేట మొదలు పెట్టాడు అంటే.. ఒకప్పుడు ప్రాణాలు తీయడం హాబీలా పెట్టుకున్న కరడుగట్టిన నేరస్థులు యోగీ సీఎం అయ్యాక ప్రాణాల కోసం పరుగులు పెట్టడం ప్రారంభించారు. అయినా ఒక్కర్నీ వదిలిపెట్టలేదు. వరుసబెట్టి ఎన్‌కౌంటర్లు చేయించాడు. దేశంలో తిరుగు లేని శక్తిగా ఉన్న బీజేపీని, తిరుగులేని వ్యక్తులుగా ఉన్న మోడీ, అమిత్‌ షాలను ప్రశ్నించే వ్యక్తుల లిస్ట్‌లో ఉండే మొదటి పేరు యోగిదే. అంతటి పవర్‌ఫుల్‌ వ్యక్తిని చంపేస్తామంటూ లారెన్స్‌ గ్యాంగ్‌ లెటర్‌ రాయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. గ్యాంగ్‌స్టర్ల పేరు చెప్తేనే గన్స్‌ తీయండి అంటూ పోలీసులకు ఆర్డర్‌ ఇచ్చే యోగీ.. తననే చంపేస్తా అంటున్న లారెన్స్‌ గ్యాంగ్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.