Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు..డిస్కౌంట్లు.. ప్రత్యేక ఆఫర్లు ఇవే..
యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బిలియన్ డేస్ ను తాజాగా ప్రకటించింది ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్. ఈ సారి తేదీలతో పాటూ ఆఫర్ల శాతాన్ని కూడా ప్రకటించడం గమనార్హం.

Leading e-commerce company Flipkart has announced its Big Billion Days, Offers, Discounts
ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ రంగురంగులతో ప్రతేకంగా వెలిగిపోతోంది. తన సాధారణ వెబ్ సైట్లో మైక్రో సైట్ ను ఏర్పాటు చేసింది. అందులో ఒక్కో వాటికి సంబంధించిన ఆఫర్లతో పాటూ తేదీలను కూడా ప్రకటించింది. అక్టోబర్ 08 నుంచి అక్టోబర్ 15 వరకూ ఈ ప్రత్యేక సేల్స్ జరుగనున్నట్లు వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లు మొదలు, గృహోపకరణాల వరకూ, ఎలక్ట్రానిక్స్ మొదలు ఫర్నీచర్ వరకూ, ఫ్యాషన్ మొదలు బ్యూటీ వరకూ అన్నింటికి సంబంధించిన ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుత తరం వారు ఏం కొనాలన్నా మునుపటి లాగా మార్కెట్ కి వెళ్లడం లేదు. బయట షాపింగ్ దాదాపు తగ్గించేశారు. అర చేతిలో ఉపయోగించే స్మార్ట్ ఫోన్లు మొదలు అవసరానికి ఉపయోగపడే అన్నింటినీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. పండుగల సీజన్ కావడంతో ఏఏ వస్తువులపై ఎంత శాతం డిస్కౌంట్లను ప్రకటించిందో పూర్తి వివరాలను చూద్దాం.
వేటిపై ఎంత ఆఫర్లు..
- 4కే స్మార్ట్ టీవీలపై 75శాతం వరకూ డిస్కౌంట్.
- రిఫ్రిజిరేటర్లపై 70శాతం వరకూ ప్రత్యేక రాయితీ.
- ఫర్నీచర్ పై భారీగా 85శాతం వరకూ డిస్కౌంట్.
- గృహోపకరణ సామాగ్రిపై 80శాతం వరకూ రాయితీ లభించనుంది.
- ఫ్యాషన్ ఉత్పత్తులపై ఏకంగా 90శాతం వరకూ తగ్గింపు ఉండనుంది.
- బ్యూటీ ప్రొడక్ట్స్ పై 60-80శాతంగా రాయితీ ఉండనుంది.
- ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్ పై 50-80 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
ప్రత్యేకమైన బ్రాండ్లపై ఆఫర్లు ఇవే..
- ఐఫోన్ 13
- ఐఫోన్ 14
- శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13
- శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జీ
- శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54
- శాంసంగ్ గెలాక్సీ ఎస్23
- శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ
- శాంసంగ్ గెలాక్సీ ఏ34
- శాంసంగ్ గెలాక్సీ ఏ23
- మోటోరోలా జీ54
- మోటోరోలా జీ54 5జీ
- మోటోరోలా ఎడ్జ్ 40
- మోటోరోలా ఎడ్జ్ 40 నియో
- వివో టి2 ప్రో 5జీ
- వివో వీ29
- ఒప్పో రెనో 10
- పోకో ఎక్స్ 5 ప్రో
- పోకో ఎఫ్5
- రెడ్ మీ నోట్ 12 ప్రో
- గూగుల్ పిక్సెల్ 6
- గూగుల్ పిక్సెల్ 7
- గూగుల్ పిక్సెల్ 7ఏ
- గూగుల్ పిక్సెల్ 8
మరిన్ని బ్రాండ్ల ఆఫర్లు ప్రకటన తేదీలు..
- మోటో ఫోన్లపై సెప్టెంబర్ 28
- వివో పై సెప్టెంబర్ 29
- ఇన్ఫీనిక్స్ బ్రాండ్లపై 30
- రియల్ మీ ఫోన్లపై అక్టోబర్ 02
- శాంసంగ్ పై అక్టోబర్ 03
- పోకో మొబైల్స్ పై అక్టోబర్ 04
- రెడ్ మీ/గూగుల్ పిక్సెల్స్ అక్టోబర్ 05
T.V.SRIKAR