HEMA ANDHRA LEADERS : హేమను వదిలేయండి ! ఫోన్ చేస్తున్న ఆ పార్టీ ఏపీ లీడర్లు
బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమె బ్లడ్ లో డ్రగ్స్ ఆనవాళ్ళు దొరకడంతో... విచారణకు రావాలని ఆదేశించారు.
బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమె బ్లడ్ లో డ్రగ్స్ ఆనవాళ్ళు దొరకడంతో… విచారణకు రావాలని ఆదేశించారు. కానీ వైరల్ ఫీవర్ అంటూ బెంగళూరు ఎంక్వైరీకి వెళ్ళకుండా డుమ్మా కొట్టింది హేమ. అయితే ఆమెను వదిలేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు రాజకీయ నేతలు బెంగళూరు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారట. పోలీసులే ఈ విషయం చెప్పడం సంచలనంగా మారింది.
రేవ్ పార్టీలో హేమ సహా 86 మంది రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్ళు బయటపడ్డాయి. దాంతో మొదట 8 మందిని సోమవారం నాడు విచారణకు రావాలని బెంగళూరు CCB పోలీసులు నోటీసులు పంపారు. ఫీవర్ అని చెప్పి హేమ డుమ్మా కొట్టింది. అప్పటి నుంచి CCB పోలీసులకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు రాజకీయ నేతలు కాల్స్ చేస్తున్నారట. హేమను వదిలేయండి… ఆమెను అరెస్ట్ చేయొద్దు… విచారణ చేసి వదిలేయండి అంటూ ఒత్తిడి తెస్తున్నారు. సీసీబీ పోలీసులే స్వయంగా కన్నడ మీడియాకు ఈ విషయం చెప్పడం సెన్షేషనల్ గా మారింది. హేమని వదిలిపెట్టమని ఏ పార్టీకి చెందిన లీడర్లు పోలీసులపై ప్రెజర్ పెడుతున్నారన్న దానిపై చర్చ నడుస్తోంది.
బెంగళూరు రేవ్ పార్టీ సంగతి బయటకు వచ్చాక…. అందులో వైసీపీ, టీడీపీ నేతలకు ప్రమేయం ఉందంటూ రెండు పార్టీల లీడర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నిందితులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. హేమ విషయానికొస్తే… ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఎక్కడా పార్టీ తరపున ప్రచారం చేసినట్టు కనిపించలేదు. కానీ జగన్ సమక్షంలో హేమ కండువా కప్పించుకున్న ఫోటోని టీడీపీ వైరల్ చేస్తోంది. మరి హేమను వదిలేయమని ఆ పార్టీ నేతలే సీసీబీ పోలీసులకు కాల్ చేసి ఒత్తిడి పెంచుతున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ చర్చ ఇలా నడుస్తుంటే… రేవ్ పార్టీపై బెంగళూరు పోలీసులు కొత్త డౌట్స్ లేవనెత్తారు. ఈ పార్టీలో IPL, ఎన్నికలకు సంబంధించి కూడా భారీ ఎత్తున బెట్టింగ్స్ జరిగినట్టు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు, IPL మ్యాచ్ ల బెట్టింగ్స్ జరిగినట్టు సమాచారం ఉందని అంటున్నారు. అలాగే రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు 2 లక్షల రూపాయలు. కానీ కొందరి దగ్గర అంతకంటే డబుల్ కూడా వసూలు చేసినట్టు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు.