Leo Movie : “లియో” సినిమాకు భారీ షాక్.. బెనిఫిట్ షోలు రద్దు.. !

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "లీయో" ఈ సినిమాలో తమిళ స్టార్ విజ‌య్‌తో త్రిష‌, సంజ‌య్ ద‌త్‌, అర్జున్ స‌ర్జా, ప్రియా ఆనంద్‌, మిస్కిన్‌, గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌, మ‌న్సూర్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇంతలో లియో కు భారీ షాక్ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2023 | 02:22 PMLast Updated on: Oct 14, 2023 | 2:23 PM

Leo Is An Action Thriller Film Directed By Kollywood Star Director Lokesh Kanagaraj The Tamil Nadu Government Has Issued An Order Canceling The Benefit Shows For This Film

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “లీయో” ఈ సినిమాలో తమిళ స్టార్ విజ‌య్‌తో త్రిష‌, సంజ‌య్ ద‌త్‌, అర్జున్ స‌ర్జా, ప్రియా ఆనంద్‌, మిస్కిన్‌, గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌, మ‌న్సూర్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇంతలో లియో కు భారీ షాక్ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం.

సాధారణంగా విజయ్ సినిమా అంటే తమిళనాడులో ఈ హీరోకు ఎక్కడ లేని అభిమానం చాటుకుంటారు. విజయ్ సినిమాలో ఎలా ఉంటారో.. బయట కూడా అంతకన్నా సున్నితంగా.. ప్రజలకు, యువతకు, విద్యార్థులకు ఎంతో కొంత సమయం కేటాయిస్తూ ఉంటాడు. సినిమాల్లోనే కాదు బయటకు కూడా హీరో అనిపించుకున్నాడు హీరో విజయ్. విజయ్ చిత్రం రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తారు. థియేటర్ల వద్ద పూల దండలు, ఫ్లెక్సీకి పాలాభిషేకాలు.. బాణాసంచా కాలుస్తూ మోత మోగిస్తూ.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు వగైరా వగైరా చేస్తారు విజయ్ అభిమానులు. లియో చిత్రం విడుదల సమయం దగ్గర పడుతున్న ఉత్తర చెన్నై అభిమానులు అభిమానుల్లో మాత్రం ఎలాంటి హంగామా కనిపించడం లేదు.. దానికి కారణం వాళ్ళ హీరో విజయ్

లియో చిత్రం రిలీజ్ కు హంగామా వద్దు అంటూ విజయ్ ఆదేశాలు జారీ.. ?

ఈ సారి చిత్రం విడుదల సమయంలో ఎలాంటి హంగామా చేయకూడదు అని విజయ్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. చిత్రం విడుదల కు మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది .. సాధారణంగా పెద్ద సినిమాలుఆర్ఆర్ఆర్ , సలార్, కేజీఎఫ్, పుష్ప, వంటి చిత్రాలు విడుదలకు వారం రోజుల/ అంతకంటే ముందు టికెట్స్ బుకింగ్ జరుగుతాయి. ఎవరికైనా తన హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎంతో ఆత్రుతతో ఉంటారు. అలాగే లియో సినిమాకు కూడా శుక్రవారం నుంచే చైన్నె, మదురై, కోయంబత్తూర్‌, మహాబలిపురం, సిల్వర్ బీచ్ వంటి ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా వాటి ప్రచారా బాగానే జరుగుతుంది. ఓ విధంగా ఈ ఇది ఓ అసాధారణమైన విషయం. ఇదంతా బాగానే జరుగుతుంది ఇంతలో విజయ్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది.

“లియో” కు తమిళనాడు ప్రభుత్వం భారీ షాక్..

leo Movie

తమిళనాడు ప్రభుత్వం లియో సినిమా స్పెషల్ షోలపై ఆంక్షలు విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. సాధారణ సినిమాలు ఎలా అడుతున్నాయో లియో చిత్రం కూ కూడా ఆ ఆంక్షలు మాత్రమే వర్తిస్తాయి. అదనపు షోలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదు అంటి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమిళనాడులో లియో చిత్రం ప్రదర్శనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అముత IAS ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాలోని అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లను చిత్రం విడుదల సమయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ‘ప్రిన్సిపల్ సెక్రటరీ లియో స్పెషల్ షోలకు ఎలాంటి అనుమతి లేదు.. ఒకవేళ ఎవరైనా బెదిరింపులకు దిగి ప్రత్యేక షోలు వేయాలని థియేటర్‌ యాజమాన్యంతో గొడవకు దిగితే వారిపై చట్టపరమై చర్యలు తీసుకుంటాము అని అముత తెలిపారు.’ చిత్ర విడుదల సమయంలో థియేటర్లలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఓ ప్రత్యేక కమిటీ వేసి పూర్తి భద్రతా చర్యలకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని IAS అముత తెలిపారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం విజయ్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. వారం ముందు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకున్న వారి పరిస్థితి ఎంటి అని.

S.SURESH