Dating Lessons : 9వ తరగతిలోనే డేటింగ్ పై లెసన్స్.. క్రష్, రిలేషన్షిప్ పై CBSE పాఠాలు
ఇటీవల కాలంలో కొందరు టీనేజీ విద్యార్థులు (Teenage Students) దారి తప్పుతున్నారనేది వాస్తవం. ప్రేమలు, దోమలు అంటూ తిరిగే వాళ్ళు కొందరు. క్రష్(Crush), ఫస్ట్ లవ్(First Love), రొమాన్స్ (Romance) అంటూ భవిష్యత్తు, కెరీర్ మీద ఆలోచన లేకుండా గడిపేవాళ్ళు మరికొందరు.
ఇటీవల కాలంలో కొందరు టీనేజీ విద్యార్థులు (Teenage Students) దారి తప్పుతున్నారనేది వాస్తవం. ప్రేమలు, దోమలు అంటూ తిరిగే వాళ్ళు కొందరు. క్రష్(Crush), ఫస్ట్ లవ్(First Love), రొమాన్స్ (Romance) అంటూ భవిష్యత్తు, కెరీర్ మీద ఆలోచన లేకుండా గడిపేవాళ్ళు మరికొందరు. టీనేజ్ పిల్లలకు… అమ్మాయి లేదా అబ్బాయి కావొచ్చు… ఎదుటి వ్యక్తితో ఎలా ఉండాలి… సమాజంలో మనం ఎలా నడుచుకోవాలి అనే అంశాలపై ఇళ్ళల్లో తల్లిదండ్రులే అవగాహన కల్పించాలి. గతంలో నీతి కథలు, పెద్ద వాళ్ళ పర్యవేక్షణలోనే పిల్లలు పెరగడం వల్ల… సమాజంలో ఎలా బతకాలి… ఇది తప్పు…ఇది ఒప్పు… అన్నదానిపై అవగాహన ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో… పిల్లలకు చెప్పడానికి తల్లిదండ్రులకు మొహవాటం అడ్డం వస్తోంది. కొందరు పేరెంట్స్ కి అంత టైమ్ కూడా ఉండటం లేదు. అందుకే పిల్లలు దారితప్పుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ పరిస్థితుల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓ నిర్ణయం తీసుకుంది. రిలేషన్షిప్స్, డేటింగ్ లాంటి వాటి మీద టీనేజ్ స్టూడెంట్స్ కి అవగాహన కల్పిస్తోంది. తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకాల్లో ఈ అంశాలపై లెసన్స్ ను వాల్యూ ఎడిషన్ పేరుతో చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో… సేమ్ ఏజ్ వారిపై ఇష్టం పెంచుకోవడం… కలిసి మెలిసి ఉండటం లాంటి వాటి నుంచి ఎలా బయటపడాలో ఈ పాఠాల్లో వివరించారు.
డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్ (Dating and Relationships) : అండర్ స్టాండింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్ … అనే పేరుతో ఒక పాఠం ఇచ్చారు. ఇందులో కొన్ని పదాలకు అర్థాలు… ఇంకొన్ని భావనలపై విద్యార్థుల అభిప్రాయాలు కోరుతూ… ఎక్సర్ సైజెస్ కూడా ఇచ్చారు. ఫోటోలు లాంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి… వాటితో ఇంకొకరిని ఆకర్షించే ప్రయత్నం చేయడాన్ని క్యాట్ ఫిషింగ్ అంటారు. అలాగే ఎలాంటి కారణం చెప్పకుండా… సడన్ గా తెగతెంపులు చేసుకోవడాన్ని ఘోస్టింగ్ అంటారు. ఇంకా సైబర్ బులీయింగ్ లాంటి పదాలకు అర్థాలను వివరిస్తూ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి లెసన్స్ ని చేర్చింది CBSE. క్రష్, స్పెషల్ ఫ్రెండ్ లాంటి ఆలోచనలను చిన్న చిన్న కథల రూపంలో వివరించారు.
టెక్ట్స్ బుక్స్ లోని ఈ పాఠాలను కొందరు Xలో పోస్ట్ చేయడంతో నెటిజెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. డేటింగ్ యాప్(Dating App)… టిండర్ ఇండియా అయితే… తెగిపోతున్న భార్యాభర్తల బంధాల మీద కూడా చాప్టర్ ఇవ్వాలని CBSE ని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం విద్యార్థులకు ఇంటర్నెట్ పూర్తిగా అందుబాటులో ఉంది… ఈ సమయంలో తమ భాగస్వాముల గురించి తెలుసుకోడానికి ఇలాంటి లెసన్స్ తో అవగాహన కల్పించడం కరెక్ట్ అంటున్నారు కొందరు నెటిజెన్స్. ఇది ప్రస్తుత విద్యార్థులకు చాలా అవసరం అనీ… టీనేజ్ లోనే ఆత్మహత్యలు చేసుకోవడం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం లాంటి సంఘటనలు జరక్కుండా ఆప వచ్చని చెబుతున్నారు. టీనేజ్ పిల్లలు… లవ్ ఎమోషన్స్ లో పడి కొట్టుకుపోకుండా CBSE మంచి స్టెప్ తీసుకుందని అన్నారు. డేటింగ్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ లాంటి అంశాలపై 20యేళ్ళు లోపు ఉన్న యూత్ కి అర్థం అయ్యేలా చెప్పడం కరెక్ట్ అని కామెంట్ చేస్తున్నారు మరికొందరు. టీనేజీ విద్యార్థులకు సమాజంపై మంచి, చెడులను వివరించేందుకు CBSE చేసిన ప్రయత్నం బాగుందని విద్యావేత్తలు, తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు.