బెజవాడ వాసులకు ఎల్జీ గుడ్ న్యూస్
ఇటీవల విజయవాడలో వరదలు సామాన్య ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా పాడైపోయిన వారి పరిస్థితి మరీ దారుణం.

ఇటీవల విజయవాడలో వరదలు సామాన్య ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా పాడైపోయిన వారి పరిస్థితి మరీ దారుణం. ఇష్టపడి కొనుక్కున్న వస్తువులు అలా వరద నీటిలో నాశనం కావడం పట్ల పలువురు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో బాధితుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు… ఎలక్ట్రానిక్ వస్తువుల సంస్థలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు పిలుపు మేరకు, వరద బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ముందుకు వచ్చింది. వరద నీటిలో తడిచిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఉచిత సర్వీస్ అందిస్తామని ప్రకటన చేసింది. స్పేర్ పార్టులపై 50% డిస్కౌంట్ ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్.