Telugu States Light Rains : తెలుగు రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్ష సూచన..
తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ తీరంలోని కొమరెన్ ప్రాంతం నుంచి పశ్చమ మధ్య బంగాళాఖాతం వరకు నిన్న తూర్పుగాలు ప్రభావంతో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అల్పపీడనం నేడు బలహినపడింది అని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం తూర్పు వైపుకు తీదురు గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
MLC KAVITHA : రేవంత్ రెడ్డీ.. నీ బెదిరింపులకు భయపడేవాళ్ళు లేరు ! : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ లో వర్షాలుపై కీలక ప్రకటన..
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేటి నుండి 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో అక్కడక్క చిరుజల్లులు కురుస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. బండంపేట్, చంద్రాయణ గుట్ట, మాధాపూర్ పలుచోట్ల వాన జల్లులు కురువనున్నాయి. హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఉదయం పూట పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు దిశలో గంటకు 8 నుంచి 10 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ శాతం 79గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలుపై కీలక ప్రకటన..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో ఈ నెల 26 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, చిత్తూరు, కృష్ణా, బాపట్ల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పలనాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాలలోని పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అల్లూరి సీతామరాజు తెలిపారు.