TS Liquor Shops Bundh: 3 రోజులు లిక్కర్ షాపులు బంద్… !
తెలంగాణలో శనివారం నుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేయబోతున్నారు. ఈనెల 13 సోమవారం నాడు లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ కంటే 48 గంటల ముందు డ్రై డేగా పాటించాలి. ఓటర్లకు మద్యం పంపిణీ జరక్కుండా, ఎన్నికల వేళ ఎలాంటి గొడవలు జరక్కుండా మద్యం షాపుల మూసివేతకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Liquor shops closed for 3 days... !
తెలంగాణలో శనివారం నుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేయబోతున్నారు. ఈనెల 13 సోమవారం నాడు లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ కంటే 48 గంటల ముందు డ్రై డేగా పాటించాలి. ఓటర్లకు మద్యం పంపిణీ జరక్కుండా, ఎన్నికల వేళ ఎలాంటి గొడవలు జరక్కుండా మద్యం షాపుల మూసివేతకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శనివారం (11నాడు) సాయంత్రం 6 గంటల నుంచి ఈనెల 13న సోమవారం ఎన్నికలు ముగిసే దాకా కూడా మద్యం షాపులు బంద్ అవుతాయి. తిరిగి ఈనెల 14న మంగళవారం యధావిధిగా తెరుస్తారు.
మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఎండలకు చల్లటి బీరు తాగాలనుకునేవారు ముందుగానే స్టాక్ తెచ్చిపెట్టుకుంటున్నారు. శనివారం నాడు స్టాక్ ఉంటుందో లేదనని రెండు రోజుల ముందు నుంచే మందుబాబు జాగ్రత్త పడుతున్నారు. దాంతో గురు, శుక్రవారాల్లోనూ మద్యం షాపుల దగ్గర రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి.