Liquor Shops, Bandh : ఆ మూడు రోజులు మద్యం షాపులు బంద్.. తొందరపడండి !
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్ లను ఈనెల 28న తేదీ సాయంత్రం 5 గంటల నుండి 30వ తేదీ పోలింగ్ ముగిసేవరకు బెల్టు షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపారు.

Liquor shops will be closed from 28th to 30th of this month.. Orders issued
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్ లను ఈనెల 28న తేదీ సాయంత్రం 5 గంటల నుండి 30వ తేదీ పోలింగ్ ముగిసేవరకు బెల్టు షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపారు. తిరిగి వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్ లను 30 తేదీ పోలింగ్ ముగిసిన అనంతరం ఎప్పుడైనా తెరుసుకోవచ్చని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ వెల్లడించారు.
Telangana Rain : తెలంగాణకు వర్ష చూచన.. నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, మద్యం నిలువ చేసిన, అక్రకమంగా తరలించిన.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఇక శంషాబాద్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 236 కేసులు నమోదు చేశామన్నారు. తమ ప్రాంతంలో మద్యం విక్రయించినా, డంప్ చేసినా ఫోన్ నంబర్ 8712658750లో ఫిర్యాదు చేయాలని కోరారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్.