శతక్కొట్టిన లివింగ్ స్టోన్ రెండో వన్డే ఇంగ్లాండ్ దే
వెస్టిండీస్ టూర్ లో ఇంగ్లాండ్ తొలి విజయాన్ని అందుకుంది. ఇంగ్లీష్ క్రికెటర్ లివింగ్ స్టోన్ సెంచరీతో దుమ్మురేపడంతో రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన విండీస్ 328 పరుగుల భారీస్కోర్ చేసింది.

వెస్టిండీస్ టూర్ లో ఇంగ్లాండ్ తొలి విజయాన్ని అందుకుంది. ఇంగ్లీష్ క్రికెటర్ లివింగ్ స్టోన్ సెంచరీతో దుమ్మురేపడంతో రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన విండీస్ 328 పరుగుల భారీస్కోర్ చేసింది.షై హోప్ సెంచరీతో సత్తా చాటాడు. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ కాస్త తడబడినా లివింగ్ స్టోన్ విధ్వంసకర సెంచరీతో జట్టును గెలిపించాడు. లివింగ్ స్టోన్ కేవలం 85 బంతుల్లోనే
5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్
47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.లివింగ్ స్టోన్‌తో పాటు సాల్ట్, బెతల్, సామ్ కుర్రాన్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది.