లివింగ్ స్టోన్ ఊచకోత ఆసీస్ బౌలర్లకు చుక్కలు
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు మ్యాచ్ లు గెలిచిన ఆసీస్ ను తర్వాతి రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ నిలువరించింది. తాజాగా లార్డ్స్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ ప్లేయర్ లివింగ్ స్టోన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు మ్యాచ్ లు గెలిచిన ఆసీస్ ను తర్వాతి రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ నిలువరించింది. తాజాగా లార్డ్స్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ ప్లేయర్ లివింగ్ స్టోన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లలో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి ఏకంగా 62 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిఛెస్ స్టార్క్ వేసిన చివరి ఓవర్లో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు కెప్టెన్ బ్రూక్ కూడా రాణించడంతో ఇంగ్లాండ్ 312 రన్స్ చేసింది. ఛేజింగ్ లో ఆస్ట్రేలియా 126 పరుగులకే ఆలౌటైంది.