Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల రేపే.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా
లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్‌ని ఈసీ ప్రకటించిన వెంటనే.. దేశవ్యాప్తంంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది.

Lok Sabha Elections 2024: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. మార్చ్ 16, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు.. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు మీడియాకు సమాచారం అందించింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రెస్ మీటింగ్ జరుగుతుంది. ఈసీకి చెందిన వివిధ సోషల్ మీడియా సైట్స్‌లో లైవ్ చూడొచ్చు.
Vladimir Putin: మళ్లీ అధికారం పుతిన్‌దే.. రష్యాలో మొదలైన పోలింగ్..!
లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్‌ని ఈసీ ప్రకటించిన వెంటనే.. దేశవ్యాప్తంంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ.. ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించిన ఒక రోజు వ్యవధిలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటం విశేషం. లోక్‌సభలో మొత్తం 545 సీట్లకుగాను, 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 సీట్లకు ఎన్నికలు జరగనుండగా, అధికారం కావాలంటే 88 సీట్లు దక్కించుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉంది.
ఒడిశాలో మొత్తం 147 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలటే 74 సీట్లు గెలవాలి. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఇక్కడ సీఎంగా కొనసాగుతున్నారు. సిక్కింలో మొత్తం 32 సీట్లు ఉండగా, 17 సీట్లు గెలిస్తే అధికారం దక్కుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఎస్‌కేఎంకు చెందిన ప్రేమ్ సింగ్ తమంగ్ సీఎంగా ఉన్నారు. ఏప్రిల్, మే నెలల్లో దశలవారీగా పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. మేలోనే ఫలితాలు వెలువడతాయి.