LOKSABHA ELECTIONS: ముగిసిన రెండో దశ పోలింగ్.. యూపీలో అత్యల్ప ఓటింగ్..
పశ్చిమ బెంగాల్‌లో 71.84 శాతం, మణిపూర్‌లో 76.46 శాతం, చత్తీస్ గఢ్‌లో 72.13 శాతం, అసోంలో 70.67 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో ఆసక్తి రేపుతున్న రాష్ట్రం యూపీ. ఎందుకంటే ఇక్కడ అత్యల్పంగా 52.91 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
LOKSABHA ELECTIONS: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం ముగిసింది.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. రెండో దశలో త్రిపురలో అత్యధికంగా 77.93 శాతం పోలింగ్ నమోదుకాగా, ఉత్తర ప్రదేశ్‌లో అత్యల్పంగా 52.91 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో 71.84 శాతం, మణిపూర్‌లో 76.46 శాతం, చత్తీస్ గఢ్‌లో 72.13 శాతం, అసోంలో 70.67 శాతం పోలింగ్ నమోదైంది.
FIRE ACCIDENT: ఫార్మా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 50 మందిని కాపాడిన బాలుడు
రెండో దశలో ఆసక్తి రేపుతున్న రాష్ట్రం యూపీ. ఎందుకంటే ఇక్కడ అత్యల్పంగా 52.91 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అలాగే మహారాష్ట్ర, బిహార్, మధ్య ప్రదేశ్‌లో కూడా తక్కువ స్థాయిలోనే పోలింగ్ శాతం నమోదైంది. మధ్యప్రదేశ్‌లో 55.16 శాతం, బిహార్‌లో 53.6 శాతం, మహారాష్ట్రలో 53.71 శాతం, రాజస్థాన్‌లో 59.35 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు కేరళలో 64.8 శాతం, కర్ణాటకలో 64.4 శాతం, జమ్మూ కాశ్మీర్లో 67.22 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి సాయంత్రం ఆరు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతమే. అయితే, సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలో ఉన్నవారికి కూడా ఓటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగే ఛాన్స్ ఉంది. శుక్రవారం.. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అంతకుముందు మొదటి దశలో, ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొదటి దశలో 34.8 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
త్రిపురలో స్థిరపడిన బ్రూ శరణార్థులు లోక్ సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. లోక్ సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. రెండో దశలో ఓటు వేసిన భారత దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఎన్డీఏ సుపరిపాలనను ఓటర్లు కోరుకుంటున్నారని, యువత, మహిళా ఓటర్లు ఎన్డీఏకు మద్దతిస్తున్నారని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు ప్రకటించారు. అయితే.. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ పోలీసు గరియాబంద్ జిల్లాలో సర్వీస్ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.