SANIA MIRZA : అద్దంలో చూసుకుంటున్నా…సానియా మీర్జా ఎమోషనల్ పోస్ట్
పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ (Cricketer) షోయబ్ మాలిక్ (Shoaib Malik) తో విడిపోయిన తర్వాత మొదటిసారిగా రెండు ఎమోషనల్ పోస్ట్స్ చేసింది భారత టెన్నిస్ (Indian Tennis) స్టార్ సానియా మీర్జా (Sania Mirz) . షోయబ్.. తన మూడో ప్రియురాలు నటి సనా జావెద్ ను పెళ్ళి చేసుకున్నట్టు షాక్ ఇచ్చాడు.
పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ (Cricketer) షోయబ్ మాలిక్ (Shoaib Malik) తో విడిపోయిన తర్వాత మొదటిసారిగా రెండు ఎమోషనల్ పోస్ట్స్ చేసింది భారత టెన్నిస్ (Indian Tennis) స్టార్ సానియా మీర్జా (Sania Mirz) . షోయబ్.. తన మూడో ప్రియురాలు నటి సనా జావెద్ ను పెళ్ళి చేసుకున్నట్టు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత సానియా కుటుంబం కూడా విడాకులను కన్ఫర్మ్ చేసింది. ఈ సంఘటన తర్వాత సానియా మొదటిసారిగా రెండు పోస్టులు సోషల్ మీడియాలో పంచుకుంది. తనను తాను సమీక్షించుకుంటున్నట్టు అర్థం వచ్చేలా ఒక పోస్ట్… మన దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తానని మరో పోస్ట్ చేసింది. అయితే పాకిస్తాన్ వ్యక్తిని పెళ్ళి చేసుకొని తప్పుచేశావ్ అంటున్నారు నెటిజన్స్. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఈ విడాకులపై స్పందించారు. షోయబ్ ను తిట్టిపోశారు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ కి చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోయారు. ఏప్రిల్ 2010లో షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది సానియా. కొన్నాళ్లు దుబాయ్‌లో ఉన్న వీళ్ళకి 2018లో ఇజాన్ పుట్టాడు. 10 ఏళ్ల పాటు బంధం బాగానే సాగింది. కొన్నేళ్ళ క్రితం వీళ్ళ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సానియా ఇండియాలో… షోయబ్ పాకిస్తాన్ లో విడి విడిగా ఉంటున్నారు. దాంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారని గత కొంతకాలంగా రూమర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత… తాను పాకిస్తాన్ నటి సనా జావెద్ ను పెళ్ళి చేసుకున్నట్టు షోయబ్ పోస్టులు పెట్టడంతో వీళ్ళ వ్యవహారం బయటకు వచ్చింది. ఇక కుటుంబ సభ్యులు కూడా కన్ఫర్మ్ చేశారు. ఆమె వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
షోయబ్ తో విడాకుల తరువాత సానియా వెంటనే స్పందించలేదు. కానీ రిపబ్లిక్ డే రోజున సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టింది. రిపబ్లిక్ డే సందర్భంగా.. జాతీయజెండాతో ఉన్న పాత ఫోటో షేర్ చేసింది. మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గౌరవంగా భావిస్తా.. హ్యాపీ రిపబ్లిక్ డే అంటూ విషెస్ చెప్పింది. ఆ తర్వాత ఇన్ స్టా గ్రామ్ లో మరో పోస్ట్ చేసింది సానియా. తనను తాను అద్దంలో చూసుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ… తనను తాను సమీక్షించుకున్నట్టు అర్థం వచ్చేలా… రిఫ్లెక్ట్ అని మెస్సేజ్ పోస్ట్ చేసింది. ఈ రెండు పోస్టుల్లోనూ తన విడాకుల గురించి ప్రస్తావన లేదు. అయినప్పటికీ… తాను కొత్త జీవితం ప్రారంభిస్తానన్న అర్థంలోనే ఉన్నాయి.
ఈ పోస్టులపై నెటిజన్స్ భారీగా స్పందిస్తున్నారు. తప్పు చేశావ్… సానియా.. పాకిస్తానీని పెళ్లాడకుండా ఉండాల్సింది అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ధైర్యంగా ఉండు సానియా.. నీ వెనుక భారతీయులు ఎప్పుడూ ఉంటారు అని ఇంకొందరు ధైర్యం చెబుతున్నారు. ఆమెను ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. షోయబ్ మాలిక్ పై ఇండియాతో పాటు, పాకిస్తాన్ లోనూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్ర తస్లీమా నస్రీన్ కూడా ఈ విడాకులపై స్పందించారు. షోయబ్ ఇంకా చాలా పెళ్ళిళ్ళు చేసుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సానియా – షోయబ్ ఎంతో సంతోషంగా ఉన్నారని అనుకున్నా… అది తప్పని తేలింది … అసలు అంత తెలివైన సానియా… షోయబ్ లాంటి బ్యాడ్ బాయ్ ని ఎలా పెళ్ళి చేసుకుందని ప్రశ్నించారు నస్రీన్. షోయబ్ తొందర్లోనే సనా జావెద్ కు కూడా విడాకులు ఇస్తాడు… అలా ఒకర్ని కాదని మరొకరిని … 11 పెళ్ళిళ్ళు చేసుకుంటాడని తస్లీమా నస్రీన్ మండిపడ్డారు.