Love Jihadi, Akbar, Sita : జంతువుల్లో లవ్‌ జిహాదీ.. కోర్టుకెక్కిన VHP.. ఇదేం ఖర్మరా నాయనా!

మనుషుల మధ్య కుల మతాల పేరుతో కుంపట్లు చాలా కామన్. వేర్వేరు మతాల వాళ్లు పెళ్లి చేసుకుంటే రచ్చ రచ్చే. ఇక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అంటే లవ్ జిహాదీ అంటూ నానా యాగీ చేసేవాళ్లున్నారు. మనుషులు సరే.. మరి జంతువులకు కుల మతాలుంటాయా..? మీరు నమ్మినా నమ్మకపోయినా.. జంతువులకూ కుల మతాలుంటాయని గగ్గోలు పెడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2024 | 12:06 PMLast Updated on: Feb 18, 2024 | 12:06 PM

Love Jihadi Among Animals Vhp In Court This Is Kharma Nayana

మనుషుల మధ్య కుల మతాల పేరుతో కుంపట్లు చాలా కామన్. వేర్వేరు మతాల వాళ్లు పెళ్లి చేసుకుంటే రచ్చ రచ్చే. ఇక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అంటే లవ్ జిహాదీ అంటూ నానా యాగీ చేసేవాళ్లున్నారు. మనుషులు సరే.. మరి జంతువులకు కుల మతాలుంటాయా..? మీరు నమ్మినా నమ్మకపోయినా.. జంతువులకూ కుల మతాలుంటాయని గగ్గోలు పెడుతున్నారు. పనిగట్టుకుని కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. బెంగాల్ సింహాల విషయంలో లవ్ జిహాద్ ఏంటో ఓసారి చూద్దాం. రాముడు, సీత ఓ జంట… ఆ పేర్లను వేరే ఎవరితో ముడిపెట్టినా రచ్చ రచ్చే… తాజాగా పశ్చిమబెంగాల్‌ అధికారులు అనాలోచితంగా చేసిన పని పెను దుమారమే రేపింది. అక్బర్‌ అనే మగ సింహానికి జోడీగా సీత అనే ఆడ సింహాన్ని తెచ్చారు. ఆ రెండింటినీ ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం వివాదాస్పదమైంది.

ఈ ఇష్యూపై విశ్వ హిందూ పరిషత్‌ ఏకంగా కోర్టుకెక్కింది. సిలిగురి సఫారీ పార్క్‌లో అక్బర్‌, సీత అనే మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. అయితే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ వీహెచ్‌పీ జల్పాయ్‌గిరిలోని హైకోర్టు సర్క్యూట్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. అటవీశాఖ అధికారులు, బెంగాల్‌ సఫారీ పార్క్‌ డైరెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చింది. పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు 20న విచారణ జరుపుతామని ప్రకటించింది. అటవీశాఖ అధికారుల వాదన మాత్రం వేరేగా ఉంది. త్రిపురలోని సెపాహిజాలా జులాజికల్‌ పార్క్‌ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాటికి కొత్తగా పేర్లు పెట్టలేదంటున్నారు.

ముందునుంచే వాటికి ఆ పేర్లున్నాయి. త్వరలోనే వీటి పేర్లు మారుస్తామన్నారు. అయితే వీహెచ్‌పీ మాత్రం రాష్ట్ర అటవీశాఖ అధికారులే సింహాలకు ఈ పేర్లు పెట్టారని చెబుతోంది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్‌ చేస్తోంది. నిజానికి ఈనెల 12న ఈ సింహాలు త్రిపుర నుంచి పశ్చిమబెంగాల్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతానికి ఈ రెండింటినీ క్వారంటైన్‌లో ఉంచారు. నెల తర్వాతే వాటిని బయటకు వదులుతారు. అక్బర్‌ తండ్రిపేరు దుష్మంత్‌, తల్లిపేరు చిన్మయి సిపాయిజ్లాగా తెలుస్తోంది. వాటికి మూడు సింహం పిల్లలు పుట్టగా వాటికి అమితాబ్‌ హిట్‌మూవీ అమర్‌, అక్బర్‌, ఆంటోనీ సినిమా ఆధారంగా పేర్లు పెట్టారు. కానీ ఇప్పుడా పేరే వివాదానికి దారి తీసింది.