Star Cricketers divorced : లవ్ సక్సెస్.. మ్యారేజ్ ఫెయిల్.. విడాకులు తీసుకున్న క్రికెటర్లు వీరే
వరల్డ్ క్రికెట్ లో ప్లేయర్స్ కు సూపర్ సక్సెస్ అయిన కొందరు క్రికెటర్లు వ్యక్తిగత జీవితాల్లో మాత్రం వైఫల్యాల బాటలో నడుస్తున్నారు.

Love success.. Marriage fail.. These are the divorced cricketers
వరల్డ్ క్రికెట్ లో ప్లేయర్స్ కు సూపర్ సక్సెస్ అయిన కొందరు క్రికెటర్లు వ్యక్తిగత జీవితాల్లో మాత్రం వైఫల్యాల బాటలో నడుస్తున్నారు. లవ్ స్టోరీ వరకూ సక్సెస్ అందుకున్నా… మ్యారేజ్ లైఫ్ మాత్రం కొందరు స్టార్ క్రికెటర్లకు మూడునాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతోంది. ఇటీవల విడిపోయిన క్రికెటర్లలో శిఖర్ ధావన్, మహ్మద్ షమీ.. తాజాగా హార్థిక్ పాండ్యా ఉన్నారు. టీమిండియా ఓపెనర్ గా ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్ 2012లో ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ అయేషా ముఖర్జీని పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు పెళ్ళై విడాకులు తీసుకుంది. అయేషాతో 11 ఏళ్ళ పాటు కలిసున్న ధావన్ ఇటీవలే విడిపోయాడు. భార్య వేధిస్తోందంటూ ఫ్యామిలీ కోర్టుు ఆశ్రయించగా న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
మరో స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ కూడా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడ్డాడు. మోడల్ హాసిన్ జహన్ ను షమీ 2012లో కలిసాడు. రెండేళ్ళ పాటు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ 2014లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2015లో ఈ జంటకు పాప కూడా పుట్టింది. అయితే ఆ తర్వాత నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడం, హాసిన్ షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు చేయడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. చివరికి ఇద్దరూ విడిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా హార్థిక్ పాండ్యా కూడా పర్సనల్ లైఫ్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేయలేకపోయాడు. ఆల్ రౌండర్ గా జట్టు విజయాల్లో కీలకంగా మారిన హార్థిక్ సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కరోనా టైంలో సింపుల్ గా మ్యారేజ్ చేసుకున్న వీరిద్దరూ గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి బంధం కూడా నాలుగేళ్ళకే ముగిసిపోయింది. క్రికెటర్లుగా అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ అయిన ఈ స్టార్స్ వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఫెయిల్యూర్స్ ను చవిచూడాల్సి వచ్చింది.