Heavy Rain In AP : నేడు తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు భారీ వర్ష సూచన.. నేడు ఏపీలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అలర్ట్ జారీ (Meteorological Department Alert) చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 11:35 AMLast Updated on: Nov 16, 2023 | 11:35 AM

Low Pressure Which Will Turn Into A Severe Storm Today Rain Forecast For Ap

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు భారీ వర్ష సూచన.. నేడు ఏపీలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అలర్ట్ జారీ (Meteorological Department Alert) చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో బంగాళాఖాతంలో వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతం లోకి ప్రవేశించింది. ఇక అక్కడి నుంచి దిశ మార్చుకుని గురువారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీరానికి తాకేలోపు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ వావావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

Vijayashanti, Resignation : కాంగ్రెస్ కు విజయశాంతి రాజీనామా.. కాంగ్రెస్‌ గూటికి రాములమ్మ !?

ఈనెల 16 నుంచి 20 వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. పిడుగులు పడే కూడా ఉంది అని ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదని.. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచింది. ఇక వర్షాలు పడే అవకాశం ఉండడంతో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రానున్న రెండు రోజులు గంటకు 40–50 కి.మీ.లు, గరిష్టంగా 60 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఆ తర్వాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని 17వ తేదీ ఉదయానికి ఒడిశా తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది.