Hyderabad Metro Rail: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాక్..
ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు టికెట్‌పై ఇచ్చే 10శాతం రాయితీని తొలగించింది. అలాగే.. 59 రూపాయల హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేసింది. ఇటీవలే.. స్టూడెంట్ పాస్‌లు, స్పెషల్ ఆఫర్స్ కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో యాజమాన్యం మరోసారి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు టికెట్‌పై ఇచ్చే 10శాతం రాయితీని తొలగించింది. అలాగే.. 59 రూపాయల హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేసింది. ఇటీవలే.. స్టూడెంట్ పాస్‌లు, స్పెషల్ ఆఫర్స్ కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
CHANDRABABU NAIDU: కుప్పంలో వాలంటీర్ల రాజీనామా.. చంద్రబాబుకు ఓటమి తప్పదా..?
గతేడాది కూడా వేసవి సందర్భంగా ఏప్రిల్‌లో రద్దీ పెరగడంతో ఇలాగే రాయితీలు రద్దు చేశారు. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఎండలు మండిపోతుండటంతో హైదరాబాద్ సిటీలో బస్సు, ఆటో ప్రయాణాలు తగ్గాయి. మెట్రోవైపు ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏసీ ప్రయాణం హాయిగా ఉండటంతో చాలామంది మెట్రోని ఆశ్రయిస్తున్నారు. వేసవి సెలవులతో ప్రయాణాల సంఖ్య మరింత పెరిగింది. రద్దీ పెరగడంతో మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీలను రద్దు చేసింది. హాలిడే కార్డుని నిలిపి వేసింది. ఇప్పుడు ఎవరైనా, ఏ రోజైనా సరే.. పూర్తి చార్జి చెల్లించి మెట్రోలో ప్రయాణించాల్సిందే. రాయితీ ద్వారా రద్దీ లేని ఉదయం, సాయంత్రం వేళల్లో పది శాతం డిస్కౌంట్ లభించేది.
ఇక హాలిడే కార్డు ద్వారా ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు, పండుగలు, సెలవు దినాల్లో రూ.59కే మెట్రోలో ఎంతదూరమైనా.. ఎన్నిసార్లైనా ప్రయాణించే వీలుండేది. కానీ, సడన్‌గా రాయితీ ఎత్తివేయడంతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు. మెట్రో కోచ్‌ల సంఖ్య పెరగకపోవడంతో రద్దీ సమయంలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గతంలో కోచ్‌ల పెంపు ప్రతిపాదనలు తుది దశకు చేరుకున్నా.. ఫలితం మాత్రం కనపడలేదు. కోచ్‌ల సంఖ్య పెంచాలని, రాయితీలను పునరుద్ధరించాలని కోరుతున్నారు నగరవాసులు.