కెఎల్ రాహుల్ పై లక్నో వేటు ? కొత్త కెప్టెన్ గా ఆ ఇద్దరిలో ఒకరు
ఐపీఎల్ మెగా వేలానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. రిటెన్షన్ కు సంబంధించిన రూల్స్ రాగానే లక్నో తమ జట్టు పగ్గాలను కొత్త వ్యక్తికి అప్పగించబోతుందని సమాచారం. దీని ప్రకారం చూస్తే కెఎల్ రాహుల్ పై వేటు ఖాయమైనట్టు చెప్పొచ్చు.
ఐపీఎల్ మెగా వేలానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. రిటెన్షన్ కు సంబంధించిన రూల్స్ రాగానే లక్నో తమ జట్టు పగ్గాలను కొత్త వ్యక్తికి అప్పగించబోతుందని సమాచారం. దీని ప్రకారం చూస్తే కెఎల్ రాహుల్ పై వేటు ఖాయమైనట్టు చెప్పొచ్చు. గత సీజన్ చివర్లో రాహుల్ కెప్టెన్సీపై లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ దగ్గరే రాహుల్ పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత నుంచీ రాహుల్ మరొక జట్టుకు మారబోతున్నాడన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మెగా వేలానికి ముందే రాహుల్ లక్నో రిలీజ్ చేస్తుందని భావిస్తున్నారు.
అతని స్థానంలో కెప్టెన్సీ కోసం ఇద్దరు ప్లేయర్స్ రేసులో నిలిచారు. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్, ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాలలో ఒకరికి కెప్టెన్సీ అప్పగించే ఛాన్సుంది. పూరన్ ను ఖచ్చితంగా రిటైన్ చేసుకోనున్న లక్నో అతనివైపే మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా షార్ట్ ఫార్మాట్ లో ఈ విండీస్ హిట్టర్ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ లతో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు. గత సీజన్ లోనూ పూరన్ భారీ ఇన్నింగ్స్ లు ఆడాడు. దీంతో అతనికే కెప్టెన్సీ దక్కే అవకాశాలున్నాయి. అదే సమయంలో కృనాల్ అవకాశాలను కొట్టిపారేయలేమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.