AANVI KAMDAR : ప్రాణాల మీదకు తెచ్చిన రీల్స్ పిచ్చి.. జలపాతంలో కొట్టుకుపోయిన అన్వి
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి పెరిగిపోతోంది. చాలామంది రిస్కీ షాట్స్ తీస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి పెరిగిపోతోంది. చాలామంది రిస్కీ షాట్స్ తీస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈమధ్య వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా… మిగతా వాళ్ళు కూడా మూర్ఖంగా అలాగే చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్ ఫ్లుయెన్సర్ అన్వి కామర్ ఇలాగే చనిపోయింది. టూరిస్ట్ ప్లేసులను చుట్టేస్తూ… అక్కడ స్పెషాలిటీని చెప్పే అన్వి… కుంబే జలపాతం దగ్గర షూట్ చేస్తూ లోయలో పడి చనిపోయింది.
అన్వి కామార్ కి సోషల్ మీడియా 2 లక్షల మంది దాకా ఫాలోవర్స్ ఉన్నారు. దేశంలో టూరిస్ట్ ప్రాంతాల్లో తిరుగుతూ రీల్స్ తీస్తుంది. ట్రావెల్ ఇన్ ఫ్లు యెన్సర్ గా పేరు తెచ్చుకుంది. రాయగఢ్ లోని కుంబే జలపాతానికి వెళ్ళింది అన్వి. అక్కడ లోయ అంచులో నిలబడి రీల్స్ చేస్తోంది. అయితే వర్షాలకు ఆమె నిలబడిన రాయికి పాకుడు పట్టింది. దాంతో కాలు జారి 300 అడుగు లోయలో అన్వి కామర్ పడిపోయింది. ఆమె ఫ్రెండ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో… ఫైర్ సిబ్బంది ద్వారా 6 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి అన్విని కష్టపడి బయటకు తీసుకొచ్చారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.
ఈమధ్య కురిసిన భారీ వర్షాలకు కుంబే జలపాతం జోరుగా ప్రవహిస్తోంది. చుట్టూ కొండలు, చెట్లతో చాలా బ్యూటీఫుల్ గా ఉంది ఆ ప్లేస్. అందుకే ఆ ప్రాంతం విశేషాలు చెప్పేందుకు వెళ్ళింది అన్వి కామర్. రీల్స్ చేస్తూనే… ఓ లోయ గురించి వివరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈమధ్యే కర్ణాటకలో కూడా ఓ యువకుడు రీల్స్ చేయబోయి… లోయలో పడి చనిపోయాడు. లోయ చివరి అంచు దాకా వెళ్ళడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ కావాలని ఇలాంటి దిక్కుమాలిన రిస్కీ షాట్స్ తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు ఇన్ ఫ్లుయెన్సర్లు.