Magunta Sreenivasulu Reddy: వైసీపీకి మాగుంట రాజీనామా.. ఒంగోలు ఎంపీగా మాగుంట తనయుడు
ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీని వీడుతున్నట్లు మాగుంట ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తన తనయుడు మాగుంట రాఘవరెడ్డి బరిలో ఉంటారని, తనకు అందించిన సహకారాన్ని రాఘవరెడ్డికి అందించాలని ప్రజలను కోరారు.

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన ఎట్టకేలకు రాజీనామా సమర్పించారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీని వీడుతున్నట్లు మాగుంట ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తన తనయుడు మాగుంట రాఘవరెడ్డి బరిలో ఉంటారని, తనకు అందించిన సహకారాన్ని రాఘవరెడ్డికి అందించాలని ప్రజలను కోరారు.
VIRAL VIDEO: ఆపరేషన్ థియేటర్‌లో నర్స్‌ల ఇన్‌స్టా రీల్స్.. పేషెంట్‌కి ఏమయ్యిందంటే..
ఇంతకాలం తనకు, తన కుటుంబానికి అండగా ఉంటున్న ఒంగోలు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రకటన ద్వారా ప్రత్యక్ష రాజకీయాలకు మాగుంట శ్రీనివాసులు దూరంగా ఉండబోతున్నారా అనే చర్చ మొదలైంది. మాగుంట.. వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా గెలిచారు. అయితే, రాబోయే ఎన్నికల్లో ఆయనకు మళ్లీ ఎంపీ టిక్కెట్టు ఇవ్వడానికి వైసీపీ నిరాకరించింది. ఆయనకు టిక్కెట్టు కోసం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. కానీ, జగన్ దీనికి అంగీకరించలేదు. దీంతో ఇంతకాలం వేచి చూసిన మాగుంట.. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ఉంటుందన్నారు. అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అయితే, ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన తనయుడికి టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించిందని సమాచారం.
త్వరలోనే మాగుంట, ఆయన తనయుడు టీడీపీలో చేరతారని, ఒంగోలు నుంచి మాగుంట తనయుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. తనయుడికి పొలిటికల్ రూట్ క్లియర్ చేసేందుకే.. మాగుంట శ్రీనివాసులు తప్పుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కుమారుడికి ఎంపీ టిక్కెట్ హామీ వచ్చిన తర్వాతే.. ఆయన వైసీపీకి రాజీనామా చేశారని సన్నిహితులు అంటున్నారు. మాగుంట రాకతో టీడీపీకి కూడా బలం పెరుగుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.