MAHALAKSHMI SCHEME: రూ. 500 సిలిండర్ పథకం ప్రారంభం.. కానీ, 3 కండీషన్లు..
ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకంలోని 5వందలకే గ్యాస్ సిలెండర్ హామీ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం అమలుకు అర్హత, షరతులు ఇతర వివరాలతో కూడిన జీవో రిలీజ్ చేసింది. ముఖ్యంగా మూడు కండిషన్లు పెట్టింది.

MAHALAKSHMI SCHEME: ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఒక్కో హామీని నెరవేరుస్తూ వెళ్తోంది. ముందుగా ఫ్రీ బస్సు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. ఇప్పుడు 5వందలకే గ్యాస్ సిలిండర్, 2వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తోంది. సీఎం రేవంత్ వాటిని ప్రారంభించారు కూడా. ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకంలోని 5వందలకే గ్యాస్ సిలెండర్ హామీ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
YS JAGAN: దేశంలో విశ్వసనీయత ఉన్న పార్టీ వైసీపీ ఒక్కటే.. సమన్వయకర్తలే అభ్యర్థులు: వైఎస్ జగన్
ఈ పథకం అమలుకు అర్హత, షరతులు ఇతర వివరాలతో కూడిన జీవో రిలీజ్ చేసింది. ముఖ్యంగా మూడు కండిషన్లు పెట్టింది. ఒకటి.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండాలి. రెండు.. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. మూడు.. లబ్ధిదారుని పేరు మీదే గ్యాస్ కనెక్షన్ ఉండాలి. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39 లక్షల మందికి పైగా లబ్ధిదారులను గుర్తించారు. పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 3 సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని.. దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ కేటాయిస్తారు. వినియోగదారులు మొదట మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి. ఆ తర్వాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ జమ చేస్తారు.
గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా OMC సంస్థలకు ఇస్తుంది. సంస్థల నుంచి DBT ద్వారా వినియోగదారులకు నగదు చెల్లింపు చేస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని మానిటరింగ్ చేయనుంది ప్రభుత్వం. భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం 5వందలు చెల్లించేలా ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్‌లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.