Mahalakshmi Scheme: ఫ్రీ బస్ ఉండదా..? మహాలక్ష్మి పథకం నిలిపివేయాలని పిటిషన్..
తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాగోల్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఈ పథకానికి వ్యతిరకంగా పిటిషన్ దాఖలు చేశారు. బస్సులలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం వివక్ష కిందకు వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Mahalakshmi Scheme: తెలంగాణలో కాంగ్రెస్ (congress)కు అధికారాన్ని అందించిన పథకాల్లో మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) ఒకటి. తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ఆర్టీసి బస్‌లో వెళ్లొచ్చని చెప్పడంతో మహిళలు చాలా ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా మధ్యతరగతి మహిళలకు ఇది చాలా హెల్ప్ అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఈ పథకానికి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు ఇంకా పెద్ద పదవి.. అందుకే ఎమ్మెల్సీ మిస్ అయిందా..?
నాగోల్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఈ పథకానికి వ్యతిరకంగా పిటిషన్ దాఖలు చేశారు. బస్సులలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం వివక్ష కిందకు వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని.. దీంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఉచిత పథకం వల్ల అవసర నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతోందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని కోరారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై భారం పడుతుందని.. దీన్ని ప్రభుత్వం భరించడం కూడా సరికాదని పేర్కొన్నారు.
ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు కేవలం మహిళల ఉచిత ప్రయాణానికి వినియోగించడం సరికాదన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఉచిత ప్రయాణాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. పిటిషన్ వాదనలో మెరిట్స్ ఉంటే.. ఈ జీవో నెంబర్ 47ను రద్దు చేసేలా హైకోర్టు తీర్పు చెప్పే అవకాశాలున్నాయంటున్నారు న్యాయ నిపుణులు. ఒకవేళ ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినా.. ఈ కేసు ముగిసేవరకూ ఫ్రీ బస్ పథకం ఆగిపోయే చాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. దీంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది.