Mahesh Babu: సంక్రాంతి కే గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ మసాల మూవీ గుంటూరు కారం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Mahesh Babu and Trivikram's latest film Guntur Karam is likely to release on Sankranti.
టాలీవుడ్ లో సంక్రాంతికి ఆర్నెల్ల ముందే బెర్తులు బుక్ అయిపోతాయి. కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా మూణ్నాలుగు నెలల ముందే ఏ సినిమాలు వస్తాయో క్లారిటీ వచ్చేస్తుంది. కానీ వచ్చే సంక్రాంతి విషయంలో మాత్రం విపరీతమైన గందరగోళం నడుస్తోంది. ఎవరికి వాళ్లు రిలీజ్ డేట్లు ప్రకటించుకుంటూ వెళ్తున్నారు.దీంతో ఆ టైంకి ఎన్ని సినిమాలు వస్తాయో.. ఏవి ఫైనల్‌గా బెర్తులను సొంతం చేసుకుంటాయో తెలియని అయోమయం నడుస్తోంది. అయితే ఇలాంటి డౌట్స్ కి చెక్ పెట్టారు గుంటూరు కారం మేకర్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ మసాల మూవీ గుంటూరు కారం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యట్రిక్ మూవీ కావడంతో ఆడియన్స్ లో అటెన్షన్ పీక్స్ కి చేరింది.అయితే గత కొంత కాలంగా ‘గుంటూరు కారం’ టీం నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం..పూజా హెగ్డే బదులు మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడంతో ఈ సినిమా రిలీజ్ పై రక రకాల రుమార్స్ వచ్చాయి. వచ్చే సంక్రాంతికి వస్తుందా? లేదా? అన్న డౌట్స్ ప్రేక్షకుల్లో నెలకొన్నాయి.అయితే తాజాగా వాటికి పులుస్టాప్ పెట్టారు మేకర్స్.100% జనవరి 12న ‘గుంటూరు కారం’ రిలీజ్ అవుతుందని తెల్చిచెప్పారు.
గుంటూరు కారం టాకీ పార్ట్ పోర్షన్ షూటింగ్ అక్టోబర్ 20 కి పూర్తవుతుందట. ఇంకో నాలుగు సాంగ్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుందట.వీలైనంత త్వరగా వాటిని ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా నైజాం రైట్స్ ని దిల్ రాజు రికార్డ్ రేటుకి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ సాంగ్ దసరాకి రిలీజ్ అవుతుందని ఈ మధ్య కాలంలో చూడనంత ఎనర్జిటిక్ గా మహేష్ ఈ ప్రాజెక్ట్ లో కనిపిస్తాడని హిట్ ఇచ్చారు మేకర్స్.మొత్తానికి ‘గుంటూరు కారం’ నుంచి సాలిడ్ అప్డేట్ రావడంతో పండగా చేసుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.