YOUTUBER CASE : మహేశ్ బాబు కూతుర్నీ వదల్లేదు.. ఏం బతుకులు రా మీవి..
సోషల్ మీడియాలో ఏదైనా వాగొచ్చు... ఎవర్నైనా తిట్టొచ్చు... ఎంతటి వాళ్ళనయినా కించపరచవచ్చు... మనం ఏం వాగినా జనం చూస్తారు. ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నారు కొందరు.
సోషల్ మీడియాలో ఏదైనా వాగొచ్చు… ఎవర్నైనా తిట్టొచ్చు… ఎంతటి వాళ్ళనయినా కించపరచవచ్చు… మనం ఏం వాగినా జనం చూస్తారు. ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నారు కొందరు. తండ్రీ కూతుళ్ళ బంధాన్ని లైంగిక కోణంలో చూశాడు యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు. పైగా తన ఫ్రెండ్స్ తో కలసి నోటికి ఎంతొస్తే అంత జోకులు వేసుకుంటూ మాట్లాడాడు. తండ్రీ కూతుళ్ళపై ఇంత నీచంగా మాట్లాడే సమాజంలోనా మనం ఉన్నాం. అని ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకునేలా ఉంది ఆ య్యూటూబర్, అతని ఫ్రెండ్స్ వ్యవహారం. అమెరికాలో ఉండే ప్రణీత్ హన్మంతు… తాను కంటెంట్ క్రియేటర్ ని అని చెప్పుకుంటాడు. ప్రణీత్ తండ్రి పేరు అరుణ్ కుమార్… ఆయనో ఐఏఎస్ అధికారి. ఏపీలో మొన్నటి దాకా సివిల్ సప్లయీస్ అండ్ ఈవో సెక్రటరీగా పనిచేసినట్టు సమాచారం. IAS అధికారి కొడుకైన ప్రణీత్ కి సమాజం అన్నా… కుటుంబం అన్నా అస్సలు గౌరవం లేదని ఆ మాటలబట్టి అర్థమవుతోంది.
ఓ చిన్నారి తండ్రితో కలసి ఆడుకుంటున్న వీడియో చూస్తే… ఎవరికైనా ముచ్చటేస్తుంది… ఆనందంతో కళ్ళు చెమరుస్తాయి. అలాంటిది ఈ నీచుడికి సెక్స్ కోణం ఎలా కనిపించిందని నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదే టైమ్ లో నటుడు సాయి ధరమ్ తేజ్ కూడా స్పందించడం. దానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రెస్పాండ్ అవడంతో తెలంగాణ డీజీపీ ప్రణీత్ హన్మంతుపై కేసుపెట్టారు. ఈ యూట్యూబర్ తో పాటు మరో నలుగురిపైనా FIR ఫైల్ అయింది. అటు ఏపీలోనూ కేసు పెడుతున్నారు. ప్రణీత్ నోటిదూలపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూతో పాటు మంత్రి సీతక్క, మంచు మనోజ్, కార్తికేయ, నారా రోహిత్, సినీ నటులు, సెలబ్రిటీలు మండిపడుతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటీ నటులపై నీచంగా మాట్లాడుతుంటాడు ప్రణీత్ హన్మంతు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితారపైనా కామెంట్స్ చేశాడు. ప్రణీత్ పై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎన్నోసార్లు ఫైర్ అయ్యారు. చిన్న పిల్లల మీద వల్గర్ జోక్స్ వేసుకుంటూ బతికే ఈ యూట్యూబర్ ప్రణీత్… కల్కి మూవీ రిలీజ్ కు ముందు ప్రభాస్ పైనా కామెంట్స్ చేశాడు. వందల కోట్లు పెట్టి సినిమా తీయడం ఎందుకు… అది డిజాస్టర్ అంటూ పనికిమాలిన రివ్యూలు ఇచ్చేశాడు. టాలీవుడ్ సినిమాలు, నటీ నటులు, సెలబ్రిటీల మీద చెత్త వాగుడుతో బతికే వీడికి… హరోం హర అనే సినిమాలో కేరక్టర్ ఇవ్వడం బుద్ది తక్కువ పని. ప్రణీత్ నోటిదూల ఆ సినిమాకు ఇబ్బందిగా మారడంతో… హీరో సుధీర్ కూడా క్షమాపణలు చెప్పాడు.
హాస్యం పేరుతో సోషల్ మీడియాలో బూతులు, కుళ్ళు జోకులు, ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఫేమస్ అవ్వొచ్చని అనుకున్నాడు ప్రణీత్ హన్మంతు. ఇలాంటి వాళ్ళకే బిగ్ బాస్ లాంటి పాపులర్ షోల్లో కూడా అవకాశం వస్తుంది… పర్సనల్ విషయాలను కూడా వెకిలిగా ప్రశ్నిస్తూ హైలెట్ అవ్వాలని చూస్తున్నారు ఈ మధ్య కొందరు యాంకర్లు, నటులు. ఒక్క యూట్యూబ్ లోనే కాదు… ఈ టీవలో ఫేమస్ అయిన కామెడీ షోస్ లోనూ ఇలాంటి బూతు కామెడీ పెరిగిపోయింది. ఒకప్పుడు సినిమాల్లోనే కనిపించే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇప్పుడు బుల్లితెరలో వినిపిస్తున్నాయి. ఎన్ని బూతులు మాట్లాడితే అంత పాపులారిటీ వస్తోంది. ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తే అంతమంది ఫాలోవర్స్ పెరుగుతున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల పేరుతో పాటు డబ్బులు కూడా వస్తుండటంతో… చాలామందికి ఈ బూతు కల్చరే ఉపాధిగా మారింది. ఇలాగే నోటికి హద్దూ పద్దూ లేకుండా… తండ్రీ కూతుళ్ళ మీద కామెంట్స్ చేసిన ఆ పశువుని జైల్లో వేయాలనీ… నరకం చూపించాలని నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇంత జరిగినా… ప్రణీత్ మాత్రం… క్షమాపణలు కోరుతూ విడుదల చేసిన వీడియోలో తనను తాను సమర్థించుకున్నాడు. ఇది డార్క్ హ్యూమర్ అనడంపై నెటిజన్ల ఆగ్రహం రెట్టింపు అయింది.